త సంవత్సరం విడుదలై సంచలనాలు సృష్టించిన ‘బాహుబలి’ ఆ విజయ యాత్రను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ‘బాహుబలి’ చైనా భాషలో డబ్ చేయబడి గత వారం విడుదలైన నేపధ్యంలో చైనాలో కూడ సంచలనాలు సృష్టిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొన్న వీకెండ్ చైనాలో విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల కలక్షన్స్ వసూలు చేసింది అని తెలుస్తోంది. 

అంతేకాదు చైనా భాక్సాఫీస్ వద్ద టాప్ టెన్ లో తొమ్మిదవ స్దానం ‘బాహుబలి’  సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 3.9 Cr ($ 600k) ఓరినింగ్ వీకెండ్ కలక్షన్స్ సాధించిందని చైనా మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం. సుమారు 6500 ధియేటర్లలో విడుదలైన ‘బాహుబలి’  సాధిస్తున్న రికార్డులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

బాహుబలి’ చైనా వెర్షన్ మరింత గ్రిప్పింగ్ గా ఉండటం కోసం దాదాపు ఇరవై నిముషాలు పాటు కోత పెట్టి మరీ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అమీర్ ఖాన్ చిత్రం ‘పీకే’ మూవీ  చైనా కలెక్షన్స్ దాటాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘బాహుబలి’ కి చైనాలో వస్తున్న అనూహ్య స్పందనను చూసి జాకీచాన్ కూడ షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ సినిమాకంటే ‘బాహుబలి’ కి చైనాలో ఎక్కువ క్రేజ్ ఏర్పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

చైనా మీడియా మొదట్లో ఈ సినిమాకు 7.1  రేటింగ్ ఇస్తే ఇప్పుడు ఆ రేటింగ్ 7.7 కు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయాలు అన్నీ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో ‘బాహుబలి’టీమ్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఓవర్సీస్ రైట్స్ ను అమెరికాకు చెందిన ఒక కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ 37 కోట్లకు కొనుక్కోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: