తెలుగు ఇండస్ట్రీలో శివ చిత్రం దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న విలనీజాన్ని పూర్తిగా మార్చారు.  వర్మ తీసిన శివ చిత్రం తర్వాత తెరపై గ్యాంగ్ వార్స్ కి సంబంధించిన చిత్రాలు బాగా వచ్చాయి. నేటివిటీకి తగ్గట్టుగా వర్మ సినిమాలు తీయడంలో దిట్ట. అంతే కాదు మని లాంటి చిత్రంతో కామెడీ పండించి రాత్రి లాంటి చిత్రాలతో భయపెట్టాడు.  ఎన్నో వైవిధ్య భరిత చిత్రాలు తీసిన వర్మ మంచి ఫామ్ లో ఉన్నపుడు ముంబాయి పయనమయ్యాడు. అక్కడ మాఫియా, హర్రర్ చిత్రాలు తీసినా పెద్ద విజయాలు సాధించలేక తిరిగి హాలీవుడ్ వచ్చికొన్ని చిత్రాలు తీశారు. అయితే ఈ మద్య వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ మంచి హిట్ కొట్టింది.

ఇక సినిమాలు తీయడం ఒకవైపు అయితే ఈ మద్య వర్మ సోషల్ మీడియాతో ముఖ్యంగా ట్విట్టర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. తన మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని నిర్మోహమాటంగా తెలుపుతూ ఎన్నో సంచలనాలకు నాంధి పలికారు.  సినిమా, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరినీ తను టార్గెట్ చేసిన లీస్టులో ఉన్నారు. తాజాగా ఇప్పుడు మనోడు కన్ను సల్మాన్ ఖాన్ పై పడింది.

ఈ నేపధ్యంలో మన న్యాయ వ్యవస్థ సెలబ్రిటి కేసుల్లో ఎంత నెమ్మదిగా పని చేస్తుందో అనే విషయాన్ని వివరించారు. వన్య ప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ని నిర్ధోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘కేవలం సెలబ్రిటీల కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని చెప్పడానికి కోర్టుకి ఏకంగా 20 ఏళ్ళు పట్టింది’ అని కామెంట్ పెట్టాడు ఈ సంచలన దర్శకుడు.


రాంగోపాల్ వర్మ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: