సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కతుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కి ఈ మూవీ రెడీ కానుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇది మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది.

ఓవైపు మహేష్ బ్రహ్మోత్సవం సినిమాతో మార్కెటె లో డల్ అయినప్పటికీ, ఇప్పడు మురుగదాస్ సినిమాతో భారీ హైప్ ని తీసుకువస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ ను ఆగష్టు 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. అదేరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులకు ఇది మంచి గిప్ట్ గా ఉంటుందని మహేష్ బాబు, మురుగదాస్ లు భావించారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ విషయంలో స్టార్ హీరో మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మురుగదాస్ మూవీలో ఎవరు యాక్ట్ చేయాలన్న ఫైనల్ డిసిషన్ దర్శకుడితే. అందుకే దర్శకుడు మురుగదాస్ కి ఇండియా వైడ్ గా మార్కెట్ ఉంది కాబట్టి, తన మూవీలో అన్ని ఇండస్ట్రీలకి సంబంధించి యాక్టర్స్ ని పెట్టుకున్నాడు.

ఒక్క హీరో తప్పితే మిగత యాక్టర్స్ అంతా కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే అని అంటున్నారు. తాజాగా తన మూవీ స్టార్ కాస్టింగ్ ని చూసుకున్న మహేష్ బాబుకి ఇది దిమ్మతిరిగే షాక్ ని ఇచ్చిందని అంటున్నారు. ఎందుకంటే మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో మహేష్ బాబుతో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలుగు యాక్టర్స్ ఉన్నారంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: