తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అభిమానంగా చూసుకుంటున్న కొంతమంది స్టార్ హీరోలు ఇప్పుడు అభిమానులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.  ఒక పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు పండుగ చేస్తారు. థియేటర్ల వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు కట్టడం..కటౌట్లు ఏర్పాటు చేయం స్వీట్లు పంచడం లాంటి చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొంత మంది అభిమానులైతే తమ హీరో పేరు మీదు అన్నదానాలు చేయడం లాంటివి కూడా చేస్తారు. ఇలా అభిమాన హీరో కోసం ఇంత చేస్తుంటే ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు అగ్ర హీరోలు ఆ అభిమానులను కన్ఫ్యూజన్ చేస్తున్నారు.  గత కొంత కాలం టాలీవుడ్ ని శాసించిన హీరో మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సాల క్రితం రాజీయాల్లోకి వెళ్లి తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు.

అయితే రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రపోజల్ వచ్చినా అది ఇప్పటికి రూపకల్పన చెందింది. అయితే ఈ షూటంగ్ కూడా షరవేగంగా జరుగుతందా అంటే నత్తనడకనే సాగుతుంది. అంతే కాదు టైటిల్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ సంవత్సరం విడుదలైన సర్ధార్ గబ్బర్ సింగ్ తో పెద్ద ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సినిమా కాస్త జాగ్రత్తగా తీయాలని చూస్తున్న సమయంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అయిన ఖుషి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం దర్శకుడు ఎస్. జె. సూర్య దర్శకత్వంలో పవన్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కాస్త క్యాన్స్ ల్ కావడం ప్రస్తుతం ఆ ప్లేస్ లో గోపాల గోపాల దర్శకుడు డాలీ వచ్చినట్లు త్వరలో పవన్ చిత్రం సెట్స్ పైకి వెళ్ల బోతున్నట్లు ఆ చిత్ర నిర్మాత పవన్ ప్రాణ స్నేహితుడు శరత్ మారర్ ప్రకటించారు.

ఇక బాలయ్య తన 100 వ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కంచె దర్శకుడు క్రిష్ తో నందమూరి నటసింహం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం కూడా అకస్మాత్తుగా ఆపినట్లు ప్రకటించారు. గత సంవత్సరం శ్రీమంతుడు లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ...నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి కూడా కాస్త బ్రేక్ పడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం టీజర్ రంజాన్ పండుగ రోజు రిలీజ్ అయ్యింది. ఇలా అగ్ర హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ హీరోలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: