మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో అల్లు ఫ్యామిలీ నుండి హీరోలుగా ఇప్పటికే అల్లు అర్జున్ స్టార్ హీరోల్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా వరుస హిట్ సినిమాలు చేస్తూ రేసుగుర్రంలా దూసుకెళ్తున్నాడు. ఇక అల్లు వారి రెండో అబ్బాయి అల్లు శిరీష్ కూడా రెండు సినిమా తీసినా అవంత సక్సెస్ అవ్వలేదు. అందుకే ప్రస్తుతం చేస్తున్న శ్రీరస్తు శుభమస్తు సినిమా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్న శిరీహ్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టేలానే ఉన్నాడు.


అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న శ్రీరస్తు శుభమస్తు సినిమా ఇప్పటికే కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అందరిని వారెవా అనిపించేలా చేసింది. ఇక ఈరోజు కొద్దిగంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లావణ్య త్రిపాఠి రిలీజ్ చేసిన ఈ ట్రీలర్ కూడా సూపర్బ్ గా ఉంది. మొదటిసారి అల్లు శిరీష్ సినిమా రిలీజ్ కు ముందే చూసేయాలి అన్నంత మంచి ఫీల్ కలిగింది సినిమా ట్రైలర్ చూస్తుంటే.


పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ముఖ్య భూమిక పోశించింది థమన్ అందించిన మ్యూజిక్. ఇప్పటికే సినిమా సాంగ్స్ రూపంలో మంచి క్రేజ్ తెచ్చిన ఈ ఆల్బం థమన్ కు కొత్త ఇమేజ్ తీసుకురాబోతుంది. ఇక సినిమాలో శిరీష్, లావణ్యల లుక్స్ కూడా కొత్తగా ఉన్నాయి.


సో మొత్తానికి అల్లు వారు రెండో అబ్బాయి కూడా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మొదటి సూపర్ హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇక త్వరలో ఆడియో కూడా సింపుల్ గానే రిలీజ్ చేసి సినిమాను ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. మరి శిరీష్ ఎదురుచూసే సూపర్ హిట్ సినిమా ఇదే అవుతుందేమో చూద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: