తెలుగు ఇండస్ట్రీలోకి సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరి బ్యూటీ అనుష్క అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ పాత్రలు అయిన పంచాక్షరి, రుద్రమదేవి,జీరో సైజ్ లాంటి చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాహుబలి 2, ఓం నమో వేంకటేశాయ, భాగమతి చిత్రాలతో బిజీగా ఉంది.  అయితే సినిమా రంగం అయినంత మాత్రాన విలాసవంతమైన జీవితం ఉండదని నటులకు కూడా చాలా కష్టాలు ఉంటాయని వాపోతుంది ఈ హాట్ బ్యూటీ.

అరుంధతి


 ఏ రంగంలోనైనా కష్టంలేనిదే ఫలితం ఉండదు.  తనకు మంచి పేరును సంపాదించి పెట్టిన సినిమాల వలన తాను పరిశ్రమలో ఉన్నా లేకపోయినా ఈ సినిమాలు తనను అభిమానులకు ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయని తెలిపింది.  ఆ మద్య వరుసగా కొన్ని చిత్రాల్లో కాల్షీట్లు ఇచ్చి తెగ కష్టపడిపోయినట్లు ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చాలా కష్టంతో కూడినవని, చాలా శ్రమపడి చేశానని అనుష్క తెలిపింది. షూటింగ్ పేకప్ అయ్యాక ఇంటికెళ్తే ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉండేదనీ ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెబితే బాధపడతారని ఒక్కోసారి లోలోపల బాధపడుతూ ఆ బాధ తట్టుకోలేక  తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్ని చెబుతుంది అనుష్క.  


రుద్రమదేవి


అయితే తన బాధ చూసి అర్ధం చేసుకొని తన కుంటుంబ సభ్యులు కొంత రెస్టు తీసుకోమని బలవంత పెట్టేవారిని కానీ కమిట్ మెంట్ ఇచ్చిన తర్వాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని అందుకే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందని తెలిపింది.  ఇక సైజ్ జీరో చిత్రం తర్వాత తన వెయిట్ పెరగడంతో  ఆ వెయిట్ తగ్గించుకోవడానికి తాను పడ్డ కష్టాల అన్నీ ఇన్నీ కావని తెలిపింది.

సైజ్ జీరో


అయితే సినిమాలు అన్న తర్వాత ఇలాంటి రిస్క్ చేయకుండా చిత్ర పరిశ్రమలో గుర్తింపు రాదని అయితే  సెట్లో మాత్రం తన బాధను పైకి తెలియనిచ్చేదా న్ని కాదు అని అనుష్క చెప్పేసింది. అందుకే అనుష్క ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసులో ఉంది. 


పంచాక్షరి



మరింత సమాచారం తెలుసుకోండి: