‘బ్రహ్మోత్సవం’ షాక్ నుండి తేరుకుని మహేష్ బాబు మురగదాస్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఈ నెల 29నుండిప్రారంభించిబోతున్నాడు. అయితే మహేష్ కు ఉన్న కొన్ని సెంటిమెంట్స్ రీత్యా ఈసినిమా షూటింగ్ కు ఆగష్టు 1 నుండి జాయిన్ అవుతున్నట్లు టాక్. 

మొదటిగా ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పై ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తారనే వార్తలు వస్తున్నాయి. షూటింగ్ స్పాట్ కు వచ్చిన మహేష్ తో మురగదాస్ ఇక వరసగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఈసినిమాను శరవేగంగా పరుగులు తీయించదానికి మాష్టర్ ప్లాన్ ఇప్పటికే మురగదాస్ రచించాడని టాక్.

ఈవార్తలు ఇలా ఉండగా మహేష్ పుట్టినరోజు ఆగష్టు 9న రాబోతున్న నేపధ్యంలో మహేష్ కు ఊహించని షాక్ ఇచ్చే విధంగా ఈసినిమా టైటిల్ ను నిశ్చయించి ఆ టైటిల్ తో పాటుగా ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసి మహేష్ అభిమానులకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి  అన్న ఆలోచనలో ఇప్పటికే మురగదాస్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ షాక్ తో నిరాశలోకి వెళ్ళి పోయిన మహేష్ అభిమానులకు ఒక జోష్ ఇవ్వడానికే కాకుండా ఈసినిమా బిజినెస్ కోసం బయ్యర్లను ఆకర్షించడానికి మురగదాస్ ఈవిధంగా వ్యూహాత్మకంగా మహేష్ పుట్టినరోజును ఉపయోగించు బోతున్నాడు. వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈసినిమా విజయం మహేష్ కెరియర్ కు ఎంతో కీలకం..


మరింత సమాచారం తెలుసుకోండి: