తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పా. రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ చిత్రంలో నటించగా ఈ చిత్రం 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రానికి ఎన్నో బాలారిష్టాలు ఎదురైనా డివైడ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకు వెళ్తుంది.  ఇప్పటి వరకు వరకు రజినీ కాంత్ నటించని విధంగా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు.  ఇక ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందే నెట్ లో లీక్ కావడం కాస్త కంగారు పెట్టించినప్పటికీ రజినీ కాంత్ స్టైల్, నటన ముందు అంతా తల వంచాల్సి వచ్చింది.  

ఈ చిత్రంలో రజినీకాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ప్రస్తుతం ఆయన వయసుకు తగ్గట్టు గానే నటించారు. సినిమా మొత్తం రజినీ వన్ మాన్ షో చేశారు. మొత్తానికి ఈ చిత్రం డివైడ్ టాక్ వచ్చినా థియేటర్లో మాత్రం హంగామా సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని  బాలీవుడ్‌లో రిమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.  అయితే రజినీ కాంత్ స్థాయిలో బాలీవుడ్ లో నటించి మెప్పించగల వారు ఎవరా అని ఆరాతీయగా ఒక్క అమితాబచ్చన్ తప్ప ఎవరూ లేరని తేలింది.

అంతే కాదు ప్రస్తుతం అమితాబచ్చన్ కూడా తన వయసు కు తగ్గట్టు గానే చిత్రాల్లో నటిస్తున్నారు.  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను కబాలి రీమేక్లో నటింప చేయాలని భావిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత అమితాబ్ ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో న‌టించ‌బోతున్న సినిమా క‌బాలి. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: