తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల తో దూసుకెళ్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే.  గత నెల రోజుల నుంచి ఈ చిత్రంపై ఎన్నో సంచలన కథనాలు వెలువడ్డాయి.  ఈ చిత్రం రిలీజ్ కి ముందే లీక్ కావడం పైరసీ కావడంతో సినిమాపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఆ చిత్రం నిర్మాత కలైపులి ఎస్ థాను మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు కూడా చాలా సీరియస్ కావడం సినిమా ప్రదర్శించిన సైట్లన్ బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత ఈ చిత్రం రిలీజ్ కావద్దని కొంత మంది డిస్ట్రీబ్యూటర్లు కోర్టును ఆశ్రయించారు. ఇలా ఎన్నో బాలారిష్టాలు దాటుకొని చిత్రం ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడం మొదట డివైట్ టాక్ తెచ్చుకున్న తర్వాత మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది. కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 3రోజుల్లో 210 కోట్లు కలెక్షన్లతో రికార్డును కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం విజయంపై రజినీ స్పందించారు. వాస్తవానికి చిత్రం పూర్తి అయిన తర్వాత  ప్రీమియం షో చూడటం అలవాటు..కానీ రజినీ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రమే చూస్తానని చెప్పడం అమెరికాలో ఈ నెల 21న విడుదల కావడం మొదటి షో తన కుటుంబ సభ్యులతో చూడటం జరిగింది. అయితే ఈ చిత్రం చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చిన రజినీ కళ్లలో నీళ్లు వచ్చాయట..ఇది చూసి దర్శకుడ పా రంజీత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. అయితే రజినీ ఈ చిత్రం చూసి ఇప్పటి వరకు తాను ఇలాంటి చిత్రంలో నటించలేదని చిత్రం చాలా బాగా వచ్చిందని  అభిమానులకు ఎలా కావాలో అలాంటి రజినీని చూపించావని రంజిత్ ని మెచ్చుకొని కౌగిలించుకున్నాడట. రజినీ కన్నీరు పెట్టుకోవడం మొదట భయపడ్డ దర్శకుడు ఆ కాంప్లిమెంట్ తో ఎక్కడ లేని సంతోషంలో మునిగిపోయాడట.

ఇక అమెరికా టూర్ ను ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చిన రజనీ మీడియాతో తన సంతోషాన్ని షేర్‌చేసుకున్నారు.కబాలిని హిట్ చేసిన ప్రేక్షకదేవుళ్లు, అభిమానులకు కృతజ్ఞతలు. శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళ్లా. వైద్య పరీక్షలు చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చా. కబాలి ఇంతటి విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన నా చిరకాల మిత్రుడు, నిర్మాత కలైపులి ఎస్ థాను, డైరెక్టర్ పా రంజిత్ తోపాటు అభిమానులు, ప్రజలు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలంటూ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు రజనీ. తాజాగా రజనీ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్ లో రోబో 2.0 మూవీతో బిజీ కానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: