తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసింది.  ఇక విడుదలైన కొన్ని సెంటర్లలో ఈ చిత్రం డివైట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విడుదలై 5 రోజులు గడిచినా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయంటే ‘కబాలి’ రేంజ్ ఏంటో వేరే చెప్పనక్కర్లేదు.  మొదట ఈ చిత్రం కొంత మందికి అర్థం కాకపోవడంతో సినిమా మాఫియా నేపథ్యంలో ఉండటం..మాల్ మసాల లేకపోవడం తో మాస్ ఆడియన్స్ కి రీచ్ కాలేక పోయింది. కానీ రజినీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్నిఖచ్చితంగా చూస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా రజనీ ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడడం లేదు.

చాలా కాలం తర్వాత రజినీకాంత్ రెండు డిఫరెంగ్ యాంగిల్స్ లో నటించారు. మొత్తానికి థియేటర్లలో కబాలి హంగామా సృష్టిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల కలెక్షన్లతో దూసుకు పోతుంది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారత దేశంలో సినిమాలే సూపర్ స్టార్..అంతే కాదు ఏ నటుడు ప్రత్యేక స్టార్ కాదు..కథ బాగుండలే కాని చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు పొందుతాయి..కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తాయి.

పెద్ద బ్యానర్..పెద్ద హీరో అని తీసిన సినిమాలు చాలా వరకు చతికల పడ్డ దాఖలాలు ఉన్నాయని పటేకర్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా  నానాపటేకర్ అన్న దాంట్లో నిజమున్నా లేక పోయినా రజినీ కాంత్ కబాలి చిత్రం మాత్రం డివైట్ టాక్ తెచ్చుకున్న విపరీతమైన కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: