నాచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన జెంటిల్ మన్ సినిమా నానికి మంచి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పది కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ సినిమా టోటల్ రన్ టైం కలక్షన్స్ అందరిని ఖుషి అయ్యేలా చేశాయి. ఈ మధ్యలో పోటీగా సరైన సినిమా ఏది లేకపోయే సరికి నాని జెంటిల్ మన్ జెంటిల్ కలక్షన్స్ రాబట్టింది.


నాని డ్యుయల్ రోల్ చేసిన ఈ సినిమాలో సురభి, నివేదా థామస్ లు హీరోయిన్ స్ గా నటించారు. అష్టా చమ్మ సినిమా తీసినా నమ్మకంతో నాని జెంటిల్ మన్ లాంటి ప్రయోగాన్ని కూడా చేశాడు. మరి ఇలాంటి ప్రయోగాలు చేయడం నాని వల్లే సాధ్యం అంటే నమ్మాలేమో. 


అయితే వరుసగా మూడో సినిమా కూడా 20 కోట్ల క్లబ్ లోకి నాని చేరిపోతాడేమో అనుకుంటే అది నిరాశ పడేలా చేసింది తప్ప. నానికి మంచి కలక్షన్స్ రావడం విశేషం. ఏరియాల వారిగా కలక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఓవర్సీస్ లో నాని తన సత్తా చాటుకున్నాడు. అయితే మిలియన్ మార్క్ కు కొద్ది దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది అంతే తప్ప నాని జెంటిల్ మన్ సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టింది.


నైజాం : 5.45 కోట్లు, వైజాగ్: 1.55 కోట్లు, ఈస్ట్ : 0.87 కోట్లు, వెస్ట్ : 0.85 కోట్లు, కృష్ణ : 1.15 కోట్లు, గుంటూరు : 1.12 కోట్లు, నెల్లూరు : 0.39 కోట్లు, సీడెడ్ : 1.63 కోట్లు, కర్ణాటక : 1.24 కోట్లు, రెస్టాఫ్ ఇండియా : 0.25 కోట్లు, ఓవర్సీస్ : 4.85 కోట్లు, మొత్తం : 19.10 కోట్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: