టాలీవుడ్ ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి గత పది సంవత్సరాల రాజకీయాల్లోకి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి వెండి తెరకు దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో తన 150 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు. తమిళ ఇండస్ట్రీలో విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రం రిమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్లు గా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా చిరు 150వ చిత్రం కత్తిలాంటోడు అనే టైటిల్‌తో ప్రచారం జరిగింది. కాని ఇటీవల రామ్‌చరణ్ ఫేస్‌బుక్ లైవ్‌లో ఆ టైటిల్ కాదని తేల్చేశాడు.

దాంతో అభిమానులు ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్‌ని జనాల మధ్యకు తెచ్చారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెపోలియన్ అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పోరాటం అతని నైజం అనే ట్యాగ్లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతు ఫోటోతో పాటు చిరు ఫోటో ఉండగా, చిరు ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్య, ల్యాండ్ మాఫియా, తొమ్మిది మంది రైతులు వంటి అంశాలకు సంబంధించి న్యూస్ పేపర్ కటింగ్ ఉంది.

రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల ప్రొడక్షన్ కూడా ఆ పోస్టర్‌పై ముద్రించి ఉంది.  ఈ విషయంలపై అఫిషియల్ గా ఎలాంటి వార్తలు రాకపోవడంతో ఫ్యాన్ మేడ్ చిత్రమని అంటున్నారు.  టైటిల్ విషయంలోను పూర్తి క్లారిటీ లేదు. చిరు బర్త్ డే ఆగస్ట్ 22న ఉన్నందున ఆ రోజున సినిమాకు సంబంధించిన వివరాలు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారిని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: