సినిమా ఇండస్ట్రీలో టాప్ పోజీషన్ కి చేరాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాలి.  రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ. ఒక సామాన్య బస్ కండెక్టర్ గా చేసిన శివాజీరావు ప్రస్తుతం తమిళ నాడు ప్రజలకు దేవుడిలా భావించే రజినాకాంత్.  సినీరంగ ప్రవేశం చేసిన కొత్తలో చాలా మంది చీత్కారం పొందిన  రజినీ తర్వాత ఆయనకు హారతి ఇచ్చి స్వాగతించారు. నడక, మాట,చేతల్లో తనకంటూ ఓ స్టైల్ ఏర్పాటు చేసుకున్న రజినీకాంత్ ప్రస్తుతం ప్రపంచ స్థాయలో గుర్తింపు పొందిన హీరో. ఒక్క భారత దేశంలోనే కాకుండా జపాన్, అమెరికా, సింగపూర్,మలేషియా లాంటి దేశాల్లో అత్యధికంగా అభిమానులను సంపాదించిన సౌత్ హీరోగా గుర్తింపు పొందారు. తాజాగా రజినీ నటించిన కబాలి చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక రజినీ కాంత్ రెమ్యూనరేషన్ వింటే షాక్ కి గురికావాల్సింది.  ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ 50 కోట్లు అక్షరాల యాభై కోట్ల రూపాయలు.

ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా  కీర్తించబడుతున్న రజనీ ఇమేజ్ కి ఇది కూడా తక్కువే అంటున్నారు అభిమానులు.  ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలైన కబాలి చిత్రం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రజనీ ని చూడటానికే ప్రేక్షకులు ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు .  కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆర్జించి చరిత్ర సృష్టించాడు.
 
తన 65వ ఏట కూడా ఏమాత్రం స్టామినా తగ్గకుండా నటనలో స్టైల్ లో రజినీకి సాటి ఎవ్వరూ రారు అన్న రీతిలో నటించాడని అభిమానులు అంటున్నారు. తాజాగా బాలి కోసం రజనీ 50 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నప్పటికీ ఆ మొత్తం ఇంకా పెరిగే చాన్స్ ఉంది ఎందుకంటే కబాలి కి సినిమా బిజినెస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల రూపంలో కూడా భారీ మొత్తం లో డబ్బు సమకూరింది దాంతో 50 నుండి 75 కోట్ల వరకు ముట్టొచ్చు అని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: