తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. మన్మధుడిగా, కింగ్ నాగార్జునకు ఇద్దరు వారసులు అందులో అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మద్య రెండవ తనయుడు అఖిల్ కూడా ‘అఖిల్’ చిత్రంతో ఎంట్రి ఇచ్చినా పెద్దగా పేరు రాలేదు. కానీ మనోడి యాక్షన్ కి మాత్రం 100 మార్కులు పడ్డాయి. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య మొదటి చిత్రం జోష్ పెద్ద విజయం సాధించలేదు..తర్వాత ఏం మాయ చేశావే చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు.

ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మళియాల బ్యూటీ సమంత. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో ఆటో నగర్ సూర్య, మనం చిత్రాలు వచ్చాయి.  ఇక మనం చిత్రం తర్వాత సమంత, నాగ చైతన్యల ప్రేమాయణం ముదిరిపోయింది. ఎక్కడ చూసినా ఈ జంట కనిపించేది...అంతే కాదు ఆ మద్య సమంత తన ట్విట్టర్ లో ఓ ప్రముఖ హీరో తనయున్ని ప్రస్తుతం యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతున్నాను అని ట్విట్ చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ విషయం పెద్దలకు తెలియడం పెళ్లికి ఓకే చెప్పెయడం జరిగిందని వార్తలు వచ్చాయి.

అయితే గత నెల రోజులుగా సమంత తన ట్విట్టర్లో రక రకాల ఫోటోలు పోస్ట్ చేయడం ప్రతి చిన్న విషయం లీకులు ఇస్తూ నిరంతరం మీడియాలో ఈ పెళ్లి విషయం వచ్చేలా సమంత వ్యవహరిస్తుండటం తో నాగార్జున కు చిర్రెత్తుకొచ్చిందట అందుకే సమంత వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాదు ఈ మద్య బెల్జియం టూర్ ఫోటో లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం నాగార్జున ఈ అమ్మడిపై చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు చేసిన వ్యవహారం చాలు ఇక సైలెంట్ గా ఉండు ఎందుకు ? ఏమిటి ? ఎలా ? అనేది మేమే చెబుతాం అప్పటి వరకు ఓపిక పట్టమని గట్టిగానే చెప్పారట నాగార్జున . 




మరింత సమాచారం తెలుసుకోండి: