బాలీవుడ్ సినీ రంగ ప్రముఖుల పిల్లల లో ఎక్కువమంది పేర్లు "ఏ" అనే అక్షరం తోనే మొదలవటం మనకు కనిపిస్తుంది. జ్యొతిష్కులు, సంఖ్యాశాస్త్ర పండితులు వ్యాప్తిలోని తెచ్చిపెట్టిన ఈ రకమైన నామకరణానికి మూలం "అన్నింటా తమ పిల్లలు ముందుండాలనే వారి తపన (ఓవర్-ప్లే). అక్షరమాల (ఆల్ఫాబెటికల్) క్రమం గా "ఏ" అనే మొదటి అక్షరంతోనే అన్నీ లిష్ట్స్ తయారౌతాయి. అంటే ఈ పిల్లల పేర్లే అన్నీ లిస్ట్స్ లో ముందుంటాయి.


ఆటల్లో, పాటల్లో, నాటకాల్లో, నాట్యాల్లో, నటనలో, ఫాషన్లలో ఎక్కడైనా ఎలా ఐనా., ముందుండటమే వారికి కావలసింది. అందుకే వారి వారి పిల్లల పేర్ల విషయములో కాస్త ఓవర్-ప్లే చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం కదా!


ఆరాధ్య బచ్చన్: ఈ పేరు బహుశ అభిషేక్, ఐశ్వర్యల గారాల పట్టికి తాతగారైన అమితాబ్ బచ్చన్ నిర్ణయించి ఉంటారు. అమితాబ్, అభిషేక్ పేర్లలో మొదటి అక్షరం "ఏ" నే కదా ఓవర్-ప్లే అయింది. అందుకే వారింటి ముద్దుల పాపాయికి కూడా "ఏ" తో మొదలయ్యే ఆరాధ్య అని పేరుపెట్టారు.

 

అర్యన్ & అబ్రం: తమ పిల్లల పేర్లను అతి జాగ్రత్తగా ఎంపిక చేశారు షారూక్-ఖాన్.

 

ఆదిరా: రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాలు ముద్దుల పాపయికి ఏ అక్షరముతో ప్రారంభమయ్యే పేరు ఎంపిక చేసుకున్నారు. 

 

వియాన్: ఈ పేరు శిల్పా షెట్టి తమ పాపకు పెట్టిన ఎంతో అందమైన పేరు. చాలా ప్రత్యేకంగా ఉందికదా!

 

ఇమారా: ఇమ్రాన్-ఖాన్ తమ ముద్దుల పాపాయికి పెట్టిన అర్ధవంతమైన పేరు. ఇమారా అంటే "శక్తివంతం - నిశ్చయం" అని-అర్ధం స్వ-హి-లి భాషలో.

 

హ్రిదాన్ & హ్రేహాన్: సాధారణం గా "ఏ" పేరుతో ఓవర్-ప్లే అయ్యే పేర్లు తన సహచరులు అందరూ పెట్టుకొంటుంటే, తన పిల్లల పేర్లు తన పేరులా "హెచ్" అనే అక్షరం తోనే మొదలయ్యే లాగా పెట్టుకున్నాడు హ్రితిక్ రోషన్.

 

ఆరవ్: అక్షయ్ తన హాండ్-సం కుమారుడి పెట్టిన పేరు. బాగా అందంగా ఉంది కదూ!

రియాన్: జెనీలియా రితేష్ దేష్ముక్ బేబీ బోయ్ రియాన్ - వారి కన్నులపంట తొలి జన్మదినం 

మరింత సమాచారం తెలుసుకోండి: