ఈరోజు విడుదల అవుతున్న ‘జక్కన్న’ సినిమాను ప్రమోట్ చేస్తూ తనను తాను టార్గెట్ చేసుకుంటూ సునీల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ చేసిన కామెంట్స్ వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయి. మొన్నటివరకు ఈ సినిమా ప్రమోషన్ కు దూరంగా ఉన్న సునీల్ నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హీరోఇజం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ఈ సినిమా విశేషాలను వివరిస్తూ తనను ఒక హీరోగా చూడవద్దు కేవలం కమెడియన్ గా చూడమని సునీల్ చేసిన వ్యాఖ్యలు వెనుక ఇప్పుడు అతడు ఎంత అయోమయంలో  ఉన్నాడో స్పష్టం అవుతోంది. తన సినిమాలలో రెండు మూడు ఫైట్ లు ఉన్నంత మాత్రాన వాటిని రెగ్యులర్ మాస్ సినిమాలుగా లెక్క కట్టి తన సినిమాలకు ప్రేక్షకులు దూరం అవుతున్న విషయాన్ని గ్రహించి సునీల్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. 
'
అంత పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న మీరు సీరియస్ రోల్స్ ఎందుకు చేస్తున్నారని ఓ ఫ్యాన్ అడిగాడు. అప్పుడే నా తప్పు అర్ధమైంది. అందుకే ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేశాను. ఈ మూవీలో ఉన్న అందరు కమెడియన్స్ లో నేనూ ఒకడిని అంతే. నన్ను హీరో అనుకోవద్దు' అంటూ సంచలన కామెంట్స్ చేసాడు సునీల్. రెండు ఫైట్లు చేయడం మినహాయిస్తే పూర్తిగా మూవీ అంతా కడుపుబ్బ నవ్వించడమే టార్గెట్ గా ‘జక్కన్న’ సినిమాను చేసాను అని చెపుతున్నాడు సునీల్. 

ఈ మూవీతో  తాను తప్పనిసరిగా హిట్ కొడతాననే నమ్మకం వ్యక్త పరుస్తున్నాడు. దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమాను తీసిన విధానం రైటర్ భవాని ప్రసాద్ డైలాగ్స్ తనకు ‘జక్కన్న’ రూపంలో సూపర్ హిట్ ఇస్తుందని గంపెడు ఆశల పై ఉన్నాడు సునీల్.  వరుస పరాజయాలతో సతమతమవుతున్న సునీల్ కు ఈ సినిమా కూడ విజయవంతం కాకపోతే  ఈ ‘అందాల రాముడి’ కెరియర్ ఇక ముగింపుకు వచ్చినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: