తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంతో ఎన్నో అవాంతరాలు ఛేదించి ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం మొదటి నుంచి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రజినీ స్టైల్ చూసి ఫిదా అయిన వారే ఎక్కువ ఉన్నారు. దీంతో అన్ని థియేటర్లు ఏ మాత్రం ఖాళీ లేకుండా పోయాయి. దీంతో ఈ చిత్రం ఇప్పుడు 250 కోట్లు దాటి 300 కోట్లు రాబట్టే దిశగా సాగుతుంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చినా, సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులు ఈ నెల 22 న పండుగ చేసుకున్నారు.

మొత్తానికి రజినీ కాంత్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిం మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఈ   చెన్నైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నిర్మాత కళైపులి థాను మాట్లాడుతూ, ఆరు రోజుల్లో ‘కబాలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అధికారికంగా ప్రకటించారు.  

మాఫియా డాన్ గా నటించిన రజనీ ని చూడటానికి జనాలు ఎగబడ్డారు అయితే స్లో నెరేషన్ , ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం రజనీ మార్క్ డైలాగ్స్ లేకపోవడంతో అనుకున్నంత సంచలనం సృష్టించలేదు . రాధికా ఆప్టే, ధన్సిక ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: