భారత ప్రేక్షకులపై దిగ్విజయయాత్ర పూర్తిచేసుకొని అనేక పాశ్చాత్య దెశాలపై తన విజయ యాత్రని అదే స్థాయిలో కొనసాగించి చైనా తీరాల్ని తాకింది. విలక్షణ చైనా ప్రేక్షకుల మనసులను సృజించి జాకీ చాన్ సినిమాలకు సైతం ఎదురురొడ్డి నిలిచింది  బాహుబలి. భారతీయ సినీ వినీలా కాశములో తానొక ధృవతారై సినీ తారాలోకంపై తెలుగు సినిమా పట్టు ఎలాంటిదొ రుచిచూపింది.




ఎన్ని విమర్శలున్నా సినిమా చూస్తున్నంతసేపూ కనువిందుగా పసందుగా మన కనులముందే  కొనసాగే దృశ్యమాలికల తారాతోరణం అనిర్వచనీయం. మది తలుపులు తట్టే అద్భుత “మౌళి మాయాజాలం”  కనురెప్పలు క్షణమైనా మూయ నివ్వదు.  ప్రపంచ స్థాయి సినిమాలను టాలీవుడ్ అందించగలదని నిరూపించింది బాహుబలి.




టాలీవుడ్ చిత్ర జగత్తు నేడు విశ్వ సినీ జగత్తుకు బాగా పరిచయమైంది. తెలుగు జాతికి,  భాష కు విశ్వవిఖ్యాతిని నందమూరి తారక రామారావు గారు తెస్తే, తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తి చం ద్రిక లని  అంతే స్థాయిలో దర్శక దిగ్గజం రాజమౌళి విశ్వవ్యాపితం చేసే పని లో ఉన్నారు. దేశ సరిహద్దులను దాటి విదేశాలను దాటి ఖండాంతరాల్లో వీరవిహారం చేస్తూ, తిరిగి మన ఏషియాలోని చైనా పై తన దూకుడు ప్రదర్శిస్తుంది. చివరకు చైనా ప్రేక్షకుల ప్రశంశల జడి వానలో తడిసి ముద్దవుతుంది.  




సంవత్సరానికి 34 విదేశీ సినిమాలని  మాత్రమే విడులచేయనిచ్చే చైనా ప్రభుత్వ పాలసీ ప్రకారం ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకే అలవాటుపడ్డ చైనా సినీ ప్రియులకు భారతీయ సినిమాల్లోని రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, లలిత కళా సమన్వితమైన దృశ్య శ్రవణ విందు రుచేంటో అదెలా ఉంటుందో విస్వానికి పరిచయ భాగ్యం కలిగించింది....దటీస్ బాహుబలి...భళిర..భళి...అనక తప్పని స్థితి. ఎన్ని "క...బాళి " లు విడుదలై  తింగిరివేషాలేసినా - సారీ కుప్పిగంతు లేసినా...హనుమంతుని తీరం చేరలేవు కదా!




"చైనా లిమిటెడ్  రిలీస్ కాన్సెప్ట్"  దాటుకొని 630 వేల అమెరికన్ డాలర్ల వ్యాపార వసూళ్ళు సాధించి చైనా ఆరాధ్య నటుడు జాకీ చాన్ సినిమాల వరదకు వీరవిహారానికి అడ్డుకట్టై నిలిచింది. మౌళిగారి బాహుబలి. నటదిగ్గజం ప్రభాస్ మౌనంగానే తన క్షత్రియ నటవిరాటౄపం రూపం దిగ్విజయంగా ప్రదర్శించిన బాహుబలి - అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, రాణా ల నట వైదుష్యం, తమన్నా ఇంకొందరు అందాలభామల శృంగార సౌందర్య విన్యాసాలు కనుపాపల్లోనే నిలిచి చైనా ప్రేక్షకుల మదిలో ముద్రవేసిఉంటాయి. సాంకేతికంగా చైనావాళ్ళు ఎన్నో వందల హాలీవుడ్ సినిమాలు చూసి ఉన్నా- క్షణమైనా మది చిలికే తెలుగు సినీ సౌందర్యానికి చిత్రీకరణకు ముగ్ధులయ్యారనటము లో సందేహం లేదు. 




చైనీయులకు భారతీయ సినిమా 1951 లోనే రాజ్-కపూర్ ఆవారా నుండే తెలుసు. 3 ఇడియట్స్, ధూం-3, పి.కే లాంటి సినిమాలు చెప్పుకోతగిన విజయాలను వసూళ్ళను సాధించాయి. హాపి న్యూ యియర్, మై నేం ఈజ్ ఖాన్ లాంటి సినిమాలు ఈ మధ్య చైనాలో విడుదలై ఒక చైనా లాంటి పెద్ద మార్కెట్ ను చేజిక్కించుకున్నాయి. చైనాలాంటి క్లిష్ట మార్కెట్ ను చేదించటం తొలిప్రయత్నంలోనే టాప్ 10 విదేశీ సినిమాల్లో 9 వ రాంక్ సాధించటం అనన్య సామాన్యం. అనితరసాధ్యం.




స్వదేశం లో అద్భుత విజయం సాధించి, పెద్ద పెద్ద పేరున్న బానర్స్ సినిమాలే అక్కడ విడుదలకు నోచుకుంటాయి. ఇప్పుడు ఈరొస్  సంస్థ రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా నటించిన భాజీరావ్ మస్తానీ చైనాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.రానున్న కొద్ది వారాల్లో రాజమౌళి-ప్రభాస్- అనుష్క-ల బాహుబలి చైనాలో చరిత్ర సృష్టించవచ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: