ఇప్పటి నుండి కొద్దిగంటల్లో సంజయ్ దత్ ఆడి Q7 ఓనర్ అవ్వబోతున్నాడు. ఈ రోజు సంజయ్ దత్ 57 వ జన్మదినం. ఆయన ముద్దుల భార్య మాన్యత ఆయన కోసం నిన్ననే డెలివరీ తీసుకున్న Q7 ఆడి కీ ని రాత్రే 0.00 కు ఆయనకు బహుశ ముద్దులు పెడుతూ అందించి ఉంటుంది. 57 యేళ్ళ సంజయ్ సమస్యలనుండి బయటబడి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించపోయే సమయానికి ఇంకొంత మాధుర్యాన్ని చేర్చింది మాన్యత. మరో విషయం కార్లంటే మోజు పడే సంజు కు కొన్ని నంబర్ల పై మోజుంది. అందుకే మాన్యత 4545 ను తమ కారుకు ఎంపికచేసుకుని ఓవర్-ఫ్లొ అయ్యే మోజు తనపైకి ప్రవహింప చేసుకునే ప్లానేమైనా ఉందేమో ఈ కేర్ లో. 




గతములోనే అంటే సంజు 51 బర్థ్-డేకి బెంట్లే కారు ప్రసెంట్ చేసింది. ఇప్పటికే రోల్స్ రొయీస్ ఘోష్ట్, పాన్-థం కార్లు సంజు గారాజ్ లో ఉన్నాయి. షహ్రాన్ ఇక్రా ట్విన్స్ పుట్టినప్పుడు ప్రియమైన భార్యకు సంజు రోల్స్ రొయీస్ ఘోష్ట్ మాన్యతకు ముద్దులతో అంటూ బహుమతి ఇచ్చాడు.




అన్నింటిని మించి ఈ రోజు సాయంత్రం పాళీ-హిల్ లో పార్టీ సల్మాన్ ఖాన్ మాన్యత ఆహ్వానాన్ని మన్నించి వస్తే మున్నభాయి లో బ్రేక్ అయిన దోస్తీ పాచ్-అప్ అవ్వచ్చు. మనం కూడా విష్ చేద్ధాం. 





ఇంకేం కొత్త ఇన్నింగ్స్, కొత్త కారు, కొత్తదనం సంతరించుకున్న భార్యా కం ప్రేయసి, కోపం మరచిన స్నేహితుడు ఇంకా కొత్త సినిమాలు ....సంజు జీవితం సాఫీగా సాగాలని జన్మదిన శుభాకాంక్షలతో ఆశిద్ధాం. ఆశీర్వదిద్ధాం.
 

Manyata Dutt gifts Audi Q 7 to her darling husband

మరింత సమాచారం తెలుసుకోండి: