రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితం తన అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ లో పాల్గొంటూ చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ కాదని ఈసినిమాకు వేరే టైటిల్ పెడతామని ఒక మెగా ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో చిరంజీవి 150 వ సినిమాకు ‘కత్తి’ లాంటి టైటిల్ ఉండబోతోంది అని ఊహలలో కలలు కంటున్నారు మెగా అభిమానులు.

నిన్న అంతా కొందరు మెగా అభిమానులు ‘నెపోలియన్’ పేరిట ఒక టైటిల్ సృష్టించి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసిన విషయం తెలిసిందే. దీనితో ఉలిక్కి పడ్డ రామ్ చరణ్ చిరంజీవి 150 వ సినిమా టైటిల్ ‘నెపోలియన్’ కాదు అంటూ తెల్చివేసాడు.

అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగానే రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసినట్లుగా వస్తున్న వార్తలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులు ఇదేమి ట్విస్ట్ అంటూ తలలు పట్టుకుంటున్నట్లు టాక్. 

ఇప్పటికే చిరంజీవి 150 వ సినిమాకు సంబంధించి రకరకాల అయోమయాలు హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు చరణ్ లేటెస్ట్ గా ‘కత్తిలాంటోడు’ టైటిల్ ను ఎందుకు రిజిస్టర్ చేయించాడో మెగా అభిమానుల ఊహలకు కూడ అందడం లేదు అని టాక్. ఒక విధంగా చరణ్ తాను కన్ఫ్యూజ్ అవుతూ మెగా అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: