సినిమాలో విషయం ఉండాలి గానీ యాక్టర్ లు ఎలా ఉన్నా పర్లేదు .. సినిమా అదే నడుస్తుంది. ఈ విషయం పాత కాలం జనాలు బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు, ఇలా నమ్మేవారిలో చిరంజీవి కూడా ఒకరు. పాత్ర డిమాండ్ చేస్తే పెద్ద వారిని తీసుకోవాల్సిన అవసరం లేదు అనీ కాస్ట్ కటింగ్ ని ఎలా తగ్గించాలో ఆయనకీ బాగా తెలుసు అనీ అంటూ ఉంటారు. ఉదాహరణ కి కోటి రూపాయల పైన డిమాండ్ చేసిన జగపతి బాబు, వివేక్ ఒబెరాయ్ , అరవింద్ స్వామీ లని పక్కన పెట్టి తరుణ్ అరోరా ని తీసుకుని వచ్చారు. ఆ విషయం లో చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నారు చిరంజీవి. తరుణ్ అరోరా కి కేవలం పదిలక్షలు ఇచ్చి కాస్ట్ కటింగ్ చేసారు అని బయట చెప్పుకుంటున్నారు.



ఇక హీరోయిన్ విషయం లో కోట్లకి కోట్లు అడుగుతున్నా కత్రినా కైఫ్ తనకి అవసరం లేదు అని చిరు అనుకుంటున్నారు. సినిమా కంటెంట్ లో అసలు హీరోయిన్ కి పెద్ద స్థానం కూడా లేనే లేదు. కేవలం పాటల వరకే తప్ప సినిమాలో హీరోయిన్ కి ఒక్కటంటే ఒక్క సీరియస్ సీన్ కూడా లేదు ఈ పాత్రకి, సో త్రిష లాంటి ఛాన్స్ లు లేని హీరోయిన్ లని పెడదాం అని చిరు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం రెమ్యునరేషన్ లు పక్కన పెట్టి కేవలం ఇరవై కొట్లలో చుట్టేస్తారు ఏమో అనిపిస్తోంది. భారీ బడ్జెట్ లో సినిమాని అమ్మేసి హైప్ పెంచేసి డిస్ట్రిబ్యూటర్ లని నిండా ముంచకుండా జాగ్రత్తగా తక్కువ బడ్జెట్ లో చేసుకుని బడ్జెట్ దాటిన తరవాత వచ్చే ప్రతీ రూపాయీ లాభం లెక్కలో వేసుకుంటే బాగుంటుంది అనేది చిరు ఐడియా కావచ్చు. ఏదేమైనా చిరంజీవి ప్లానింగ్ చూసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు బుద్ధి తెచ్చుకోవాలి అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: