భారత దేశంలో పులుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని ప్రభుత్వం పులుల సంరక్షణ కోసం నానా తంటాలు పడుతుంటే..ఈ మద్య పులుల వేట మరీ తీవ్రం అయ్యింది. అయితే జనావాసల మద్య పులులు సంచరిస్తున్నాయంటే కొన్ని ప్రాంతాల వారు ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకోవడం అటవీశాఖ వారు అక్కడకు వెళ్లి ఆ పులిని బంధించి జూ పార్క్ కి తరలించడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో గ్రామీణులు పులులను వేటాడి కొట్టి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా తెలుగు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పులులను రక్షించండి అంటూ తన ట్విట్టర్ లో సందేశం ఇచ్చాడు.

ఈ మధ్యకాలంలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న సెలబ్రిటీస్‌ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  ప్రకాష్‌ రాజ్‌ కర్ణాటకలోని బందిపూర్‌ గ్రామంలో సంచరిస్తూ అక్కడి స్కూల్‌ పిల్లలకి, ఆ గ్రామ ప్రజలకి మన జాతీయ మృగం అయిన పులిని కాపాడుకోవడం మన బాధ్యతనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.  అంతే కాదు ప్రకాష్‌ రాజ్‌ 'సేవ్‌ టైగర్‌' అనే కాన్సెప్ట్‌తో నేషనల్‌ లెవల్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ టైగర్‌ని సేవ్‌ చెయ్యడం ఎంత అవసరం అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు.  

దీనికి కారణం ఒక రోజు ప్రకాశ్ రాజ్ కర్ణాటకలోని నాగర్‌హోల్‌ ఫారెస్ట్‌‌లో తిరుగుతూ అక్కడి ప్రజలకి పులులను కాపాడాలని అన్న విషయంపై వివరిస్తున్న సందర్భంలో ఓ పులి చెట్టుకు వేలాడుతూ ఉరి తీయబడిన దృశ్యం కనబడింది. ఈ సంఘటన ఆయన హృదయాన్ని కదిలించిందట. అందుకే తన ట్విట్టర్ లో సేవ్‌ టైగర్‌ అన్ని విషయంపై ప్రజల్లో చైతన్యం రావాలని తన భావాలను ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: