జూనియర్ ఎన్టీఆర్ కు తన తాత నందమూరి తారకరామారావు అన్నా ఆయన నటించిన పాత్రలు అన్నా విపరీతమైన ఇష్టం. ఎప్పటికైనా ఎన్టీఆర్ నటించిన పౌరాణిక జానపద సినిమాలను రీమేక్ చేయాలి అని కలలు కంటున్న జూనియర్ కు అనుకోని షాక్ ఇచ్చాడు అల్లు శిరీష్. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారంఅల్లు శిరీష్ లేటెస్ట్ గా మల్లిడి వేణు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ‘జగదేకవీరుని కథ’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడ పూర్తి అయినట్లు టాక్. 

ఈసినిమాలో అల్లు శిరీష్ రెండు వ్భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. 1961లో కె.వి.రెడ్డి డైరక్షన్లో వచ్చిన సినిమా ‘జగదేక వీరుని కథ’ ఆరోజులలో సూపర్ హిట్ మూవీ ఈ సినిమాలోని ఒక పాటలో ఎన్టీఆర్ ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తాడు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ లేని ఆరోజులలో ఎన్టీఆర్ ను అలా ఐదు పాత్రలలో చూపించడం ఇప్పటికీ టాలీవుడ్ వండర్.

అయితే అటువంటి క్లాసిక్ సినిమా టైటిల్ ను ఇప్పడు అల్లు శిరీష్ కు వాడుతున్నారు అన్న ఇషయం జూనియర్ దృష్టికి వెళ్ళడంతో యంగ్ టైగర్ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన సినిమాలకు కూడ టైటిల్ గా ఎన్టీఆర్ టైటిల్స్ ను పెట్టుకునే సాహసం చేయని జూనియర్ కు అల్లు శిరీష్ మితిమీరిన ధైర్యం చూసి ఆశ్చర్య పడుతున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీరస్తు శుభమస్తు’ శిరీష్ అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే శిరీష్ ఇలాంటి సాహసాలు ఇంకెన్ని చేస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: