గత పది సంవత్సరాల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కలువ కళ్ల భామ కాజల్ అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వెళ్లింది. ఈ అమ్మడికి ఎంత మంది పోటీ ఉన్నా తన అందమైన ముఖం, అమాయకమైన చూపులతో చక్కటి నటన ప్రదర్శిస్తూ హీరోలందరినీ తనవైపునకు తిప్పుకుంది.  లక్ష్మీకళ్యానం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మాత్సవం చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేతిలో లేవు..దీంతో మరోసారి హాట్ హాట్ గా తన అందాల ప్రదర్శనతో అందరి చూపు తనవైపు మరల్చింది.

కాజల్ - జీవా జంటగా కోలీవుడ్‌లో రానున్న మూవీ కావలై వేండమ్.ఈ చిత్రానికి సంబంధించి హోటల్ లొకేషన్‌లో కాజల్- జీవాపై కొన్ని సీన్స్‌ని డైరెక్టర్ చిత్రీకరించాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో కాజల్ స్విమ్ చేస్తూ డ్యాన్స్ చేసే కాజల్ ని చూస్తే నిజంగా మతి పోతుంది. ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు నటీనటులు.  

ఈ ఫోటోలు చూసి అంతా షాక్ అయ్యారు..కాజల్ నింజగా ఇలా రెచ్చిపోయిందేమిటా అని అనుకుంటున్నారు.  గతంలో ఇలాంటి సీన్స్ చేయాలంటే రకరకాల కండీషన్స్ పెట్టే ఈ అమ్మడు, ఈ మూవీ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ఇన్‌సైడ్ సమాచారం. అసలే టాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ లేక విలవిల‌లాడుతున్న కాజల్‌కు కావలై ఫిల్మ్ లైఫ్ ఇస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: