కృష్ణవంశీ.. తెలుగులో ప్రతిభావంతులైన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరు. టాప్ ఫైవ్ అంటూ లెక్కేస్తే.. ఈయన పేరు కచ్చితంగా ఉంటుంది. మొదటి చిత్రం గులాబీతోనే తనేంటో సత్తా చాటారు. ఐతే.. దర్శకుడిగా మొదటి సినిమా విడుదలై 20 సంవత్సరాలైనా.. ఇప్పటివరకూ ఆయన తీసింది కేవలం 20 సినిమాలే. 

తనను కదిలించే అంశం దొరికితేనే సినిమా చేస్తా అంటాడు కృష్ణ వంశీ. ఒక గులాబీ, సిందూరం, అంతపురం, మురారి, మహాత్మ, ఖడ్గం.. వంటి సినిమాలు కృష్ణవంశీ స్టామినా ఏంటో తెలియచేస్తాయి. కెరీర్లో ఇన్ని ఆణిముత్యాలున్నా.. పెద్దహీరోలతో మాత్రం ఆయనకు సినిమాలు లేవు. 


ప్రత్యేకించి పవన్ కల్యాణ్ వంటి హీరోతో ఒక్కసినిమా కూడా చేయలేదు. అదే ప్రశ్న అడిగితే.. కృష్ణ వంశీ చెప్పే సమాధానం షాక్ కలిగించకమానదు.. పవన్ కల్యాణ్ వంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్టా అని ఎదురు ప్రశ్న వేస్తారు కృష్ణవంశీ. 

పవన్‌ కల్యాణ్ వంటి క్రౌడ్ పుల్లింగ్ హీరోతో సినిమా చేసేటప్పుడు అభిమానులు కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు.. అప్పుడు ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టులు మాత్రమే చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్‌ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా ? అని ఎదురుప్రశ్నించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో . నా పాయింట్‌కి పవన్ సూట్ అయితే, వెళ్లి అడగడానికి నేను రెడీ అంటున్నారు కృష్ణవంశీ.



మరింత సమాచారం తెలుసుకోండి: