తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓరెయ్..నాన్న నీ అబ్బా..అంటూ తండ్రీని ముద్దు ముద్దుగా తిట్టడం..నా పేరు షణ్ముఖ శల్మ ఎన్ని సార్లు చెప్పాలి యువర్ ఆనల్..అంటూ డైలాగ్ కొట్టి నవ్వించినా అది ఒక్క సుదాకర్ కి మాత్రమే చెల్లుతుంది. అప్పట్లో చిరంజీవి చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ కామెడీ విలన్ గా యాక్ట్ చేసిన ఘనత సుధాకర్ కే దక్కింది. అంతే కాదు సుధాకర మెగాస్టార్ కి మంచి మిత్రుడు కూడా.  హీరోగా, విలన్ గా, సహనటుడిగా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన సుధాకర్ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్లో కమీడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తొలిసారే హీరోగా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సుధాకర్ తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ కమీడియన్లలో ఒకరిగా మారారు.  గత కొంత కాలంగా ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా సినిమాలకు దూరం అయ్యారు.

ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకొని ఇప్పుడు ఓ చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మద్య ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో హీరోగా చాన్స్ వచ్చినపుడు ఎంతో సంతోషించారట..అయితే తన పక్కన హీరోయిన్ గా రాధిక నటించడం కాస్త గుబులుగా ఉండేదని దానికి కారణం ఆమె ఎం.ఆర్.రాధ గారి కూతురు కావడం పైగా తనకూ నటన కొత్త కాడం కాస్త కంగారు అనిపించే సమయంలో షూటింగ్  స్పాట్ లో పెద్ద అవమానం జరిగిందట.   ఇద్దరి మధ్య తొలి సీన్ రాధిక పరుగెత్తుకుంటూ నా దగ్గరికి రాగానే నేను ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆమెను ఎత్తుకున్న సమయంలో అనుకోకుండా నా చేయి ఆమె లంగాలోకి వెళ్లింది.

దీంతో రాధికకు కోపం వచ్చి నా చెంపపై గట్టిగా కొట్టింది. దీంతో మొదటి రోజే ఇలా అయ్యిందేమిటిరా నాయనా అనుకున్నాను. తర్వాత షూటింగ్ బాగా రావడానికి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగాలని కలిసి సినిమాలకు వెళ్లడం, కలిసి డిన్నర్ కు వెళ్లడం లాంటివి చేయాలన్నారు.  ఇలా వెళ్తూ వెళ్తూ తమ మద్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని మంచి ఫ్రెండ్ కూడా అయ్యామని అప్పటి నుంచి షూటింగ్ లో ధైర్యంగా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ఎంట్రీ ఇస్తున్న సుధాకర్ మరిన్ని సినిమాల్లో ఆఫర్లు రావాలని కోరుకుందాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: