తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. విచిత్ర సోదరులు, దశావతారం లాంటి చిత్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో రక రకాల గెటప్స్ తో అలరించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా డిఫరెంట్ పాత్రల్లో ప్రాణం పోసి నటించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో హీరో విక్రమ్ ఒకరు..శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రల్లో కనిపిస్తూ..తెలుగు, తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఎలాంటి పాత్రల్లో అయినా పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తాడనే పేరు ఉన్న విక్రమ్ తాజాగా  ''ఇరు మగన్ '' తెలుగులో ఈ సినిమా ''ఇంకొక్కడు '' పేరుతో అనువాదం అవుతోంది .

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు విక్రమ్.ఇక గెటప్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విక్రం ఈ చిత్రంలో కూడా రకరకాల గెటప్ లలో కనిపించనున్నాడు.   ‘గే ’ వేశంలో అచ్చం ఆడవారిలా కనిపిస్తూ అదే సమయంలో హీరో గా గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ విక్రమ్ కనబరుస్తున్న నటకు మంచి మార్కులే పడుతున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మలేషియా నేపథ్యంలో తెరకెక్కింది. నయనతార , నిత్యా మీనన్ లు నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రైలర్ దుమ్మురేపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: