ప్రయోగాత్మక పాత్రలకి పెట్టని కోట హీరో కమల్ హాసన్. భారత దేశం లో ఏ హీరో చెయ్యనన్ని ప్రయోగాలు చేసారు ఆయన. ఒక హీరోలో ఎన్ని షేడ్ లు ఉంటాయో , ఎన్ని షేడ్ లు ఉండడానికి ఆస్కారం ఉందో అవన్నీ చేసిన తరవాత కూడా ఎవ్వరి ఊహకి అందని క్యారెక్టర్ లని చేసారు ఆయన. నెగెటివ్ క్యారెక్టర్ లలో కమల్ కి తిరుగులేదు అనే చెప్పాలి. ఇంద్రుడు చంద్రుడు లో మేయర్ పాత్రలో విలన్ గా చేసినా , అభయ్ సినిమాలో సైకో పాత్ర చేసినా సినిమా రిజల్ట్ ని పక్కన పెట్టి జనాలు కమల్ కి , అతని నటన కీ హర్షం వ్యక్తం చేసారు.

 

అలాంటి కమల్ హాసన్ ని భవిష్యత్తు లో నటన విషయం లో తలదన్నేవారు ఒస్తారు అని ఊహలో కూడా ఎవ్వరూ అనుకోరు కానీ విక్రం - సూర్య మాత్రం ఆయనకి గట్టి పోటీనే ఇస్తున్నారు. అప్పట్లో సేతు సినిమాతో హీరో సూర్య కొత్త ప్రయోగానికి నాంది పలికాడు ఈ సినిమా కోసం మేకప్ వేసుకోవడమే కాక పిచ్చోడిలా అవ్వడం కోసం సన్నబడడానికి తిండి మానేసాడు , నల్లగా అవ్వడం కోసం ఎండలో నిలుచున్నాడు కూడా. ఆ తరవాత వచ్చిన శివ పుత్రుడు సినిమా టైం లో విక్రం కూడా చాలా కష్టపడ్డాడు. మానసిక వికలాంగుడి పాత్ర చెయ్యడం కోసం తనని తాను కష్టపెట్టుకున్నాడు విక్రం, అంత వరకూ ఎందుకు  మొన్నటికి మొన్న ఐ సినిమా కోసం విక్రం ఎంత కష్ట పడ్డాడో అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు ఇరుమురుగాన్ కోసం చాలా కష్ట పడ్డట్టు కనిపిస్తున్నాడు విక్రం. విలన్ పాత్రలో ఒక హిజ్రాగా నటించాడు. సూర్య కూడా మొన్న 24 లో విలన్ గా చేసి సూపర్ హిట్ కొట్టేసాడు. ప్రయోగాలు చెయ్యడం , ప్రయోగం కోసం కష్టపడడం , ప్రయోగాలతో హిట్ లు కొట్టడం ఈ విషయం లో కమల్ కి వీరిద్దరూ వారసులు అనిపించుకుంటున్నారు. కొడుకులు లేని కమల్ కూతుళ్ళని హీరోగా చెయ్యగా ఆయన అభిమానులకి ఆయన నుంచి సరైన వారసుడు రాలేదు అనే బాధ ఉండనే ఉంది. ఆ బాధ ని భర్తీ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ , పాత్ర కోసం కష్టపడుతూ తమ సత్తా చాటుతున్నారు వీరు ఇద్దరూ. క్రేరీర్ గ్రాఫ్ ఎలా ఉన్నా కూడా ఇచ్చిన పాత్ర కోసం నిరంతరం శ్రమిస్తూ కమల్ హాసన్ కి నిజమైన వారసులు అనిపించుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: