ఎన్నెన్నో భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు దారుణంగా నిరాశపరచినప్పుడు జనాలు ఒకరకమైన చికాకులో ఉంటారు. అలాంటి టైం లో ఒక మంచి సినిమా పడితే వారికి భలే ఉత్సాహం ఉంటుంది. అది కూడా అస్సలు వారికి తెలియని, హిట్ అవుతుంది అని వారు ఊహించని సినిమా అయితే వారి సంతోషానికి అడ్డు అదుపు ఉండనే ఉండదు. ఒక సినిమా అంచనాలని మించి విజయం సాధించింది అంటే ఆ సినిమా మీద పెద్దగా ఆశలు లేవు అనే అర్ధం చేసుకోవాలి.

 ఈ మధ్య కాలం లో బిచ్చ గాడు - అ ఆ సినిమాలు దీనికి ఉదాహరణగా మిగిలాయి. బిచ్చగాడు సినిమా సరిగ్గా బ్రహ్మోత్సవం కి అటూ ఇటూగా విడుదల అయ్యింది . బ్రహ్మోత్సవం గోలలో పడి ఎవ్వరూ ఈ సినిమాని పెద్దగా లెక్క చెయ్యలేదు. బ్రహ్మోత్సవం హ్యాంగ్ ఓవర్ లో ఉన్న జనాలు బిచ్చగాడు చూసి వావ్ అనుకున్నారు. అ ఆ కి కూడా బ్రహ్మోత్సవం నుంచి సైడ్ కలక్షన్ ల ద్వారా నే జనం పెరుగుతూ వచ్చారు. కబాలి దెబ్బకి విలవిలలాడిపోయిన తెలుగు జనాలకి పెళ్లి చూపులు సినిమా ఉపశమనం ఇచ్చింది.

తెలుగు స్టార్ లకి కూడా ఎన్నడూ లేనంత హైప్ తో కబాలి తెలుగునాట విడుదల అవ్వగా ఈ సినిమా హైప్ మొత్తం మొదటి షో తోనే ఎగిరిపోయింది. థియేటర్ కి మరొక భాషా సినిమా ఉంటుంది అని ఊహించుకుని వెళ్ళిన జనాలు బాషా కాదు కదా తలలు పట్టుకుని బయటకి వచ్చారు. ఆ సినిమా మీద చిరాకుతో ఉన్న జనాలకి సరైన ఉపశమనంగా పెళ్లి చూపులు భలే తగిలింది. ఓవర్ హీరోయిజం , ఫైట్ లూ, కన్ఫ్యూజన్ కామెడీ , అర్ధం పర్ధం లేని పాటలు ఈ గోల లేకుండా ఎదో ఒక నవల చదువుతున్నట్టు సాగింది ఈ సినిమా.

దీంతో హమ్మయ్య అనుకున్న సగటు ప్రేక్షకుడు కొత్త తరహా కామెడీ కూడా ఉండడం తో థియేటర్ కి రిపీట్ లు కూడా వేస్తున్నాడు. అ ఆ కీ , బిచ్చగాడు కీ మహేష్ బాబు బెనిఫిట్ అయితే పెళ్లి చూపులు సినిమాకి రజినీకాంత్ ఉపయోగపడ్డాడు అని అనుకోవచ్చు.  సాధారణంగా కబాలి హిట్ అయ్యి ఉంటే -  రజినీకాంత్ సృష్టించే కలక్షన్ ల సునామీ లో పెళ్లి చూపులు యావరేజ్ టాక్ తో నడిచేది, సినిమాలు ఏవీ లేకపోవడం తో అద్భుతంగా నడుస్తోంది అని ఘంటాపథంగా చెప్పచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: