తెలుగు ఇండస్ట్రీలో సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ  అతి కొద్ది కాలంలోనే అగ్రహీరోలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ శాతం గ్లామర తరహా పాత్రల్లో నటించడానికి మాత్రమే ఇష్టపడతారు..కానీ వీరికి భిన్నంగా అనుష్క ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది. అందాల తార అనుష్క ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రంతో పాటు సింగం3, ఓం నమో వెంకటేశాయ అనే చిత్రాలలో నటిస్తోంది.

రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్ర చేయనుండగా, ఆ పాత్రకి సంబంధించిన లుక్‌ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు.  ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన అనుష్క ఇప్పుడు మరో వైవిద్యమైన పాత్రలో కనిపించనుందట.  ఇటీవల వెంకటేశ్వర స్వామిగా నటిస్తోన్న సౌరబ్ జైన్ లుక్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అనుష్క లుక్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Om Namo Venkatesaya Telugu Movie Motion Poster
హథీరామ్ బావాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నాగ్ హథీరాం బాబా పాత్రను పోషించనున్నాడు. ఈ చిత్రం మరో అద్భుతమైన అద్యాత్మిక చిత్రంగా ఉండబోతుందని దర్శకులు రాఘవేంద్ర రావు అంటున్నారు.  ఈ చిత్రంలో ప్రగ్యా జస్వాల్, విమలా రామన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: