సినిమా అనగానే మన కళ్ళకి ఒక రంగుల ప్రపంచం కనిపిస్తుంది, సినిమా వాళ్ళని ఆరాధ్య దైవాలుగా చూసే ఈ దేశం లో నటులూ, దర్శకులూ, నిర్మాతలూ అందరూ సెలెబ్రిటీలు గా వెలుగుతూ ఉంటారు. వారిని జీవితంలో ఒక్కసారి అయినా చూస్తే చాలు అన్నటు ఎదో దేవుడి గురించి ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అందరం. వారి నుంచి ఒక్కసారి ఆటోగ్రాఫ్ లాంటిదో, సేల్ఫీ లాంటిదో దక్కింది అంటే ఇక జీవితాంతం మనం ఆ విషయం గురించి ఎప్పుకుంటూనే ఉంటాం మరి. వారు మాట్లాడిన మాటలు అన్నీ నిజాలు అనుకుని వారిని ఫాలో అయ్యే సందర్భాలు కూడా బోలెడు ఉంటాయి.

చిత్ర సీమలో వారిని ఆదర్శంగా తీసుకనే వారు కోకొల్లలు. అయితే ఇక్కడ కూడా దుర్మారుగులు ఉంటారు అని, బయట ఉన్న చీప్ మెంటాలిటీ లు ఇక్కడ కూడా మామూలే అని కొన్ని సంఘటనలు తీవ్రంగా నిరూపిస్తున్నాయి. అభిమానం పేరుతో అమ్మాయిలని మోసం చేసి, రేప్ చేసే దుష్టులు ఇక్కడ కనిపిస్తున్నారు. సినిమాల పేరు చెప్పి అమ్మాయిలని లోబరచుకున్న సెలెబ్రిటీ అన్న కథలు మనం నిత్యం వార్తల్లో చదువుతూనే ఉన్నాం.

ఆమిర్ ఖాన్ నిర్మించిన పీప్లీ లైవ్ సినిమా కి కో డైరెక్టర్ గా పని చేసిన ఫారూఖీ ఒక అమెరికా జాతీయురాలి మీద అత్యాచార యత్నం చేసిన కేసులో ఏడాది పాటు జైల్లో పడ్డాడు. అమెరికా లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒక అమెరికా యువతీ రాగా ఆమె ప్రాజెక్ట్ నిమిత్తం డిల్లీలో ఉంటూ ఫరూఖీ తో పరిచయం పెంచుకుంది. ఆమెకి పార్టీ ఇస్తున్నా అంటూ ఇంటికి పిలిచి పార్టీ జరుగుతూ ఉన్న సమయంలోనే గదిలోకి తీసుకుని వెళ్లి రేప్ చెయ్యబోయాడు మనోడు. ఆమె ఈ సంఘటన తరవాత అమెరికా కూడా వెళ్ళిపోయింది. ఎవరికీ చెప్పలేదు కూడా, దాంతో ఇతను హమ్మయ్య అనుకున్నాడు. కానీ అనుకోకుండా అమెరికా లోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఇతని మీద రేప్ కేస్ పెట్టేసింది. దాంతో మార్చ్ 28 న అతను రేప్ చేసిన విషయాలు పోలీసులకి చెప్పడం , ఇతను దోషిగా తేలడం ఏడేళ్ళు జైలు శిక్ష పడ్డం అన్నీ నెలల వ్యవధిలో జరిగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: