బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా పేరు తెచ్చుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఏదో ఒకటి దాటి వేస్తుంటాడు..కానీ ఈ సారి మీడియా అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చాడు.  బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పటినుంచి సల్మాన్ ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. అంతే కాదు సల్మాన్ తో చాలా మంది హీరోయిన్లు ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు కోడై కూసాయి. అంతే కాదు కొంత మంది హీరోయిన్లు ఈయన గారి కోసం ఎదురు చూసి చూసి పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.  సల్మాన్ కి వయసు పెరుగుతున్నా తన స్టామినా ఏమాత్రం కోల్పోకుండా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ టాప్ కలెక్షన్లు రాబడుతున్నాడు.

ఇక  మీడియా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తనదైన స్టైల్లో సెటైర్లు వేసే   సల్మాన్.. ఈసారి కాస్త ఘాటైన సమాధానం ఇచ్చాడు. మొన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నిర్మిస్తున్న ఫ్రీకీ అలీ చిత్రం ప్రచారంలో భాగంగా, సల్మాన్ ఎన్నాళ్ళ నుండో దాచి ఉంచుకుని ఎప్పుడు చెప్దామా అని ఆలోచిస్తున్నా ఇప్పుడు ఆ రెండు సీక్రెట్స్ మీకు చెబుతా..అంటూ అందులో ఒకటి వివాహం చేసుకోలేదంట. ఇంకోటి ఏంటంటే.. ఇప్పటివరకు శృంగారంలో పాల్గొనలేదట. అంతే కాదండోయ్.. పెళ్ళికి తర్వాత జరిపే శృంగారమే నిజమైన శృంగారం అంటూ సల్మాన్ ఖాన్ చెప్పాడు.

సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన  'ఫ్రీకీ అలీ' చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అతి సాధారణ కుటుంబానికి చెందిన అలీ తన ప్రేమను గెలుచుకోవడం కోసం గోల్ఫ్‌ ఛాంపియన్‌ కావడమే ఈ చిత్ర కథ. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: