"లే..లే.. లేలేలే.... నా రాజా ... లే..లే..లే నారాజా లేస్త‌నంట‌వా.. న‌న్నే.. లేప‌మంటావా",  "జ్యోతి లక్ష్మీ చీర క‌ట్టింది అంటూ" సిగ్గుల మొగ్గ‌లు చేసి తెర చిందులేస్తే పరుష పుంగ‌వులు ఉర్రూతలూగాల్సిందే.. అంతే కాకుండా ఐటమ్ సాంగ్ లోనేకాకుండా... విల‌న్ పాత్ర‌ల్లోనూ... ఇటు హ‌స్య సన్నివేశాల్లోనూ  త‌న‌దైన పంథాలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆల‌రించారు న‌టి  జ్యోతిల‌క్ష్మీ. ద‌క్షిణాది సినిమాల్లో ఐట‌మ్ సాంగ్ కు ఎన‌లేని ప్రాధాన్య‌త క‌ల్పించిన ఆ న‌టి పేరు పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌న‌టిగా తన కెరీలో ప్రారంభించి... అమ్మ‌డిగా... అమ్మ‌గా... అమ్మ‌మ్మ‌గా న‌టించారు. ప్ర‌స్తుతం ఇటు సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ... అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తున్నారు. తాజాగా న‌మిత ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన జ‌గ‌న్మోహిని సినిమా లో న‌టించారు. నేడు ఆమె ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమె సినిమా రంగ ప్ర‌వేశం త‌దిత‌ర విష‌యాలు మీ ముందుంచుతున్నాం....

బాల న‌టిగా సినిమా ఎంట్రీ...

త‌మిళ‌నాడు రాష్ట్రం తంజావూర్ జిల్లా  లో శాంభ‌వి, టీకే  రామరాజ‌న్ ల‌కు 1955 డిసెంబ‌ర్ 22 న‌ జ‌న్మించారు.అమ్మ శాంభ‌వి కాంచీపురం నాయుడు వంశీకులు. జ్యోతి ల‌క్ష్మీ తో క‌లిపి మొత్తం  ఎనిమిది మంది సంతానం. అంద‌రికంటే పెద్ద కూతురు జ్యోతిలక్ష్మీ అయితే.. చిన్న కూతురు జ‌య‌మాలిని. ఇక తండ్రి వినాయ‌క ప్రొడ‌క్ష‌న్స్ లో ఓ భాగ‌స్వామిగా ఉండేవారు. అయితే చిన్న నాడే మేన‌త్త ఎస్పీఎల్ ధ‌న‌ల‌క్ష్మీకి దత్త‌త ఇచ్చారు  జ్యోతి ల‌క్ష్మీ తల్లిదండ్రులు. అయితే ఫేమ‌స్ ద‌ర్శ‌కుడు టీఆర్ రామ‌న్, టీఆర్ రాజ‌కుమారి మేన‌మ్మామ‌, మేన‌త్త‌లు. అప్ప‌ట్లోనే మేన‌త్త‌లు చాలా ఫేమ‌స్ హీరోయిన్. న‌టనంటే చిన్న నాటి నుంచే ఇష్టంగా ఉండే జ్యోతిలక్ష్మీ తో మామయ్య టీఆర్ రామ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఫేమ‌స్ హీరో శివాజీ గ‌ణేష‌న్ న‌టించిన "గూండు కిళి "(పంజ‌రంలో చిల‌క‌) సినిమాలో చిన్న పాప పాత్ర‌గా న‌టించారు. అప్ప‌డు జ్యోతి ల‌క్ష్మీ వ‌య‌సు ఐదేళ్లు. అదే క్ర‌మంలో నా ఎనిమిదేళ్ల వ‌య‌సులో  మ‌ళ్లీ మామ‌య్య ద‌ర్శ‌క‌త్వం లో న‌టించారు. అందులో సావిత్రికి చిన్న వ‌య‌సు పాత్ర. 

ఎంజీఆర్ హీరోగా మొద‌టి సినిమా....
 
బాల‌న‌టిగా అడుగు పెట్టినా జ్యోతి ల‌క్ష్మీ తొలిగా హాస్య పాత్ర‌లో న‌టించారు. అంటే మొద‌టి నుంచి జ్యోతి లక్ష్మీ హ‌స్య పాత్ర‌ల‌కే ప్రాదాన్య‌త ఇచ్చేవారు. ఎంజీఆర్ హీరోగా న‌టించిన "పెరియ ఇడ‌త్తు పెణ్" అనే సినిమాలో న‌గేష్ కు జోడీ గా న‌టించారు. అప్ప‌టికి జ్యోతి ల‌క్ష్మీ వ‌య‌సు 12 యేళ్లు. అప్ప‌ట్లో ఈ సినిమా హీట్ కావ‌డంతో, జ్యోతి లక్ష్మీ వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.  ఆ వెంట‌నే కిషోర్ కుమార్ జోడిగా "పాయ‌ల్ కి ఝ‌న్కార్" చిత్రంలో న‌టించారు. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ కావ‌డంతో జ్యోతి లక్ష్మీ కి ఒక్క‌సారిగా అగ్ర‌స్థాయి న‌టిలో లిస్టు లో చేరిపోయింది. ఆ త‌రువాత నుంచి మ‌ల‌యాళం చిత్రాలు సైతం ఆమె ను వ‌రించాయి. విన్సెంట్ ద‌ర్శ‌క‌త్వంలో న‌జీర్ చెల్లెలిగా "ముర‌ప్పెన్" చిత్రం లో న‌టించారు. అన్నాచెల్లెళ్ల ప్ర‌ధాన ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాలో పాత్ర‌కు జాతీయ అవార్డు వ‌రించింది అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా జ్యోతిలక్ష్మీ తీసుకున్న కార్య‌క్ర‌మాన్ని చాలా సార్లు గుర్తు చేసుకున్నారు. ఇక మ‌ల‌యాళీ లో సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే తెలుగు లో అవ‌కాశాలు సైతం ఆమె త‌లుపులు తట్టాయి. వెంట‌నే అంగీక‌రించిన జ్యోతిలక్ష్మీ... మొద‌ట‌గా పెద్ద‌క్క‌య్య సినిమా లో హర‌నాథ్ తో ఓ పాట న‌టించారు. అది చాలా ఫేమ‌స్ అయ్యింది. అనంత‌రం ఆమె తెలుగు సినీమాల్లో ఐట‌మ్ సాంగ్స్ ప‌రిమితమం కావాల్సి వ‌చ్చింది.

చెల్లెలు జ‌య‌మాలినితో పోటీగా నిలిచింది 

అయితే ఐట‌మ్ సాంగ్ చేసినా ఆమె మంచి గౌర‌వ‌మ‌ర్యాద‌లే ఉండేవి. హీరోలు, దర్శ‌క‌లు ఆప్యాయంగానే ఆద‌రించేవార‌ని.. ఎంజీఆర్ గారు త‌న‌తో పాటు మిగిలిన న‌టులంద‌ర‌కీ గౌర‌వ‌మ‌ర్యాద‌లు, పారితోషికాలు స‌రిగ్గా అందుతున్నాయా లేదా అని అడిగేవార‌ని అప్ప‌ట్లో ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పారు. వాస్తవానికి అప్ప‌ట్లో పారితోషికం చాలా త‌క్కువే. ఎంజీఆర్, జ‌య‌ల‌లిత హీరో హీరోయిన్లు గా చేసిన సినిమాల్లో చాలా వాటిలో ప‌నిచేశారు. వ్యాంప్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా... క‌మేడియ‌న్ , విల‌న్ పాత్ర‌లు కూడా చేశారు.  ఇక త‌న చెల్లెలు జ‌య‌మాలిని సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌డంతో జ్యోతి లక్ష్మీ గట్టి పోటీనే త‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. అయినా ఆమెకు అవ‌కాశాలు మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇద్ద‌రు పోటా పోటీగా న‌టించేవాళ్లు. ఒకనొక ద‌శ‌లో ఇద్ద‌రి సినిమాల మ‌ధ్య పోటీ ఉండేది. ఓ సారి కృష్ణ న‌టించిన "కురుక్షేత్రం" సినిమా లో జ్యోతి లక్ష్మీ న‌టించ‌గా... అదే స‌మయంలో ఎన్టీఆర్ న‌టించిన సినిమాలో జ‌య‌మాలిని న‌టించింది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే సారి విడుద‌ల  కావ‌డంతో  వీర‌ద్దరి మ‌ధ్య పోటీ అని  అప్ప‌ట్లో జ‌నం అనుకునేవారు. 

జ్యోతి లక్ష్మీ ప్రేమ వివాహం....

జ్యోతి ల‌క్ష్మీ వైవాహిక జీవితం దాదాపుగా చివ‌రి ద‌శ‌లో మొద‌ల‌య్యాయి.  80 వ ద‌శ‌కం చివర్లో అయ్యింది. కెమెరామెన్ గా పనిచేస్తున్న సాయిప్ర‌సాద్ తో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్ప‌ట్లో సాయిప్ర‌సాద్ జ్యోతి లక్ష్మీ అన్న‌య్య తో షూటింగ్ వ‌చ్చేవారు. అలా జ్యోతిలక్ష్మీ తో ప‌రిచ‌యం ఎర్ప‌డింది. అది కాస్తా ప్రేమ గా మారింది. అయితే వీరి వివాహనికి ఇరు కుటింబీకులు అడ్డు ప‌డ్డారు. దీంతో ఇద్ద‌రు ముంబాయి పారిపోయి.. అక్క‌డ అక్కా బావ ల సహాయంతో రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఆ స‌మ‌యంలోనే అక్కినేని నాగేశ్వ‌ర్ రావు సినిమాలో జ్యోతి లక్ష్మీ సాంగ్ ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే త‌న ప్రేమ వివాహం ఉండ‌టంతో ఆ సాంగ్ కు హాజ‌రు కాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో నా ప్రేమ వివాహం హాట్ టాపిగ్ గా మారింది. అనంత‌రం పెళ్లి చేసుకుని చెన్నై వ‌చ్చిన త‌రువాత అల్లు రామ‌లింగయ్య తో "మొగుడు వ‌చ్చాడు.. కొత్త మొగుడు వ‌చ్చాడు" అనే పాట‌లో న‌టించారు. 

తెలుగు సినిమా లో జ్యోతి ల‌క్ష్మీ క్రేజ్ ఎక్కువ‌....

ఇక చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ న‌టిస్తూనే ఉండాల‌న్న జ్యోతి లక్ష్మి ఆశ కొంత వ‌ర‌కు నిరాశగానే మిగిలింద‌ని చెప్పాలి. మ‌రీ ముఖ్యంగా తెలుగు చిత్ర సినీమా లో న‌టించ‌డం ఆమె చాలా ఇష్టంగా ఉండేది.అప్ కోర్స్ ఆమె కు ఎక్కువ శాతం క్రేజ్ నిచ్చింది కూడా తెలుగు సినీమా ఇండ‌స్ట్రీనే. తమిళంలో ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చిన ఆమె మాత్రం తెలుగు సినిమాల‌కే మొగ్గు చూపేది. ఆమె న‌టించిన తెలుగు సినిమాల్లో "పిల్లా పిడుగా", "గాంధర్వ  క‌న్య‌", "సీతారాములు", "బెబ్బులి", "క‌లుసుకోవాల‌ని" , "దొంగ‌రాముడు", "బంగారు బాబు", "స్టేట్ రౌడీ", "బిగ్ బాస్" లాంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివ‌రి క్ష‌ణంలో ఆమె మ్యూజిక్ డైర‌క్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ హీరోగా న‌టిస్తున్న "త్రిష  ఇల్లెన్న న‌య‌న‌తార"  అనే త‌మిళ సినిమాలో న‌టిస్తున్నారు.  ఇంకా పేరు పెట్ట‌ని మ‌రో రెండు త‌మిళ సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. 

క్యాన్స‌ర్ తో క‌న్నుముశారు....

500 ల‌కు పైగా సినిమాల్లో న‌టించిన జ్యోతి ల‌క్ష్మీ..  హీరోయిన్ గా 30 సినిమాల వ‌ర‌కు చేశారు. తెలుగు , తమిళం క‌న్న‌డం , మల‌యాళం , హిందీ భాష‌ల్లో న‌టించారు. చివ‌ర‌కు సినిమాల్లో అవ‌కాశాలు లేక,  సీరియ‌ల్ న‌టిస్తూ జీవ‌నం  కొన‌సాగించారు. కొంత కాలంగా బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ్యోతి ల‌క్ష్మి(57) నేడు చెన్నై లోని త‌న స్వ‌గృహంలో క‌న్నుముశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: