గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్ తో టాప్ మోస్ట్ వార్తలకు ఎక్కిన జంట సమంత, నాగచైతన్య.  అయితే తెలుగు సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా నాగ చైతన్యతోనే..దీంతో వీరి మద్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఆటో నగర్ సూర్, మనం చిత్రాలో ఈ జోడీ చాలా బాగా నటించినట్లు మంచి కెమిస్ట్రీ వర్క్ ఔట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. అంతే కాదు వారి మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి..అయితే వాటన్నింటికీ పులిస్టాప్ పెడుతూ సమంత తాను ఓ యువ హీరోని ప్రేమిస్తున్నట్లు అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ఆ హీరో తల్లిదండ్రులు కూడా నటులే అని ఆ మద్య ట్విట్టర్ లో హింట్ ఇచ్చింది. తర్వాత నాగచైతన్యతో చెట్టా పట్టాలేసుకొని తిరగడంతో ఆ ప్రేమికుడు నాగచైతన్య అని తెలిసిపోయింది.

సమంత ఇప్పుడు ఏమి ట్వీటు చేసినా కూడా అది పెద్ద వార్తే అయి కూర్చుంటోంది.  మధ్యన సరదాగా ట్విట్టర్లో ఓ ట్వీట్ చేస్తూ, సెప్టెంబర్ లో పెళ్ళి చేసుకోవట్లేదని చెప్పింది. అంతకంటే ముందు తనకు ఎన్ లాకెట్ అంటే చాలా అమూల్యమైన విషయంగా చెప్పుకొచ్చింది. సమంత తన లవ్‌ని బయటపెట్టేసింది. లేటెస్ట్‌గా నాగచైతన్య.. తను నటించిన ‘ప్రేమమ్’ మూవీ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. దీనిపై తన ప్రేమను అక్షరాల రూపంలో కాకుండా లవ్ సింబల్స్ రూపంలో వ్యక్తం చేసింది ఈ అమ్మడు.చైతూ అప్‌లోడ్ చేసిన పోస్టర్‌కి లవ్ సింబల్స్‌ను జోడిస్తూ ఆ పోస్ట్‌ను షేర్ చేసింది.  

సాధారణంగా సమంత ఇలాంటి సంబల్స్ తో ఎప్పుడు రెస్పాన్స్ ఇచ్చేది కాదని మొట్టమొదటి సారిగా తన ప్రియుడి కోసం ఇలాంటి లవ్ సింబల్స్ తో తన లవ్ తెలిపిందని అంటున్నారు. త్వరలో చైతూ-సామ్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు వార్తలు లేకపోలేదు. వీళ్లిద్దరు కలిసి షాపింగ్‌‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి .ఇదిలావుండగా నాగ్ ఇటీవల స్పందిస్తూ.. ఇంకా మ్యారేజ్ డేట్ ఓకే కాలేదని, వాళ్లు ఎప్పుడు పెళ్లికి సిద్ధమయితే అప్పుడు తాను ఏర్పాట్లలో నిమగ్నమవుతానంటూ సూచనప్రాయంగా చెప్పాడట. ఐతే, చైతూ, అఖిల్ మ్యారేజ్‌లు ఒకేసారి అవుతాయనే వార్తలను తోసి‌పుచ్చాడు.  నాగ్ తన కొడుకుల మ్యారేజ్ విషయంలో క్లారిటీ ఇచ్చేయడంతో సమంత లవ్ సింబల్ ద్వారా తన ప్రేమని వ్యక్తం చేసిందని అంటున్నారు. 

సమంత ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: