జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా’ పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం వెలుగు చూస్తున్న కొద్దీ ఆ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలో యువ హీరో నవదీప్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నవదీప్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మరొక యువ హీరో సిద్ధార్థ కూడా కనిపించనున్నాడు. ఇటీవలే బాద్ షా కోసం సిద్ధార్థ నటించిన సన్నివేశాలను రెండు రోజుల పాటు చిత్రీకరించారు. చిన్నదైన అయినా ఒక కీలకమైన పాత్రను బాద్ షా సినిమాలో సిద్ధార్థ పోషిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న బాద్ షా సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: