తెలుగు తెరపై ఒక్క వెలుగు వెలిగిపోయిన నిషాకళ్ల సుందరి త్రిష కెరీర్ ముగిసినట్లేనా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దశాబ్దానికి పైగా స్టార్ హీరోలందరితో జతకట్టి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఈ మద్య నటించిన చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడం అంతే కాకుండా కొన్ని ఆఫర్లు వచ్చినా భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు అప్ కమింగ్ హీరోయిన్లను ఆశ్రయించడం జరుగుతుంది. 2015లో బాలక్రిష్ణతో చేసిన ' లయన్ ' మూవీయే  త్రిషకి హీరోయిన్ గా చివరి సినిమా. ఆ సమయంలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ`నాయ‌కి`లో అవకాశం వచ్చింది.

హారర్ కామెడీగా తెరకెక్కిన నాయకి మీద పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులు అయ్యాయి.  ఒక రకంగా చెప్పాలంటే ఆడియో వేడుక జరుపుకున్న చాలా రోజుల తర్వాత థియేటర్లో ప్రదర్శించిన ఈ చిత్రం అసలు విడుదల అయ్యిందా అని కొంతమందికి డౌట్.  తాజాగా త్రిష నాయకి సినిమాకి రావాల్సిన రెమ్యునరేషన్ విషయంలో కూడా త్రిష దారుణంగా మోసపోయిందట.

నాయకి మూవీని త్రిష మేనేజర్‌ ప్రొడ్యూస్ చేసాడు.ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా తెలుగు రైట్స్ త్రిషకి ఇచ్చాడట ఆ మేనేజర్. కానీ రిలీజ్ అయిన తరువాత ధియేటర్లలో నాయకి అడ్రస్ లేకుండా పోవడంతో త్రిష తన రెమ్యునరేషన్ కూడా లాస్ కావాల్సి వచ్చింది.  అంతే కాకుండా గత కొంత కాలంగా త్రిష ఎప్పుడు వివాదాల్లో ఉండటం ఆమెపై పలు ఆరోపణలు రావడం కూడా ఓ మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: