ఈ మద్య కొంత మంది పబ్లిసిటీకోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వారైతే సినిమా షూటింగ్ మొదలు సినిమా కలెక్షన్లు అయ్యేంత వరకు రక రకాలుగా పబ్లిసిటీ చేస్తూ సినిమాపై హైక్ తీసుకు వస్తున్నారు. అంతే కాదు సినిమా ప్రమోషన్స్ కూడా రక రకాలుగా చేస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో  కపిల్‌ శర్మ తో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటీ కామెడీ నైట్స్ ప్రోగ్రామ్ లో ‘ది ఫ్లయింగ్‌ జాట్‌’ సినిమా కోసం కపిల్‌ శర్మ షోకు వచ్చింది జాక్వెలిన్‌.  ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది..ఆ షోకి వచ్చిన జాక్వెలిని పెళ్లి కూతురు గెటప్ లో వచ్చి హంగామా చేసింది..అంతే కాదు పెళ్లి కూడా చేసుకుంది.

అయితే ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరా అని అనుకుంటున్నారా..! మరెవరో కాదు కామెడీనైట్స్ నిర్వాహకుడు కపిల్ శర్మనే పెళ్లి కొడుకు. అదేంటీ ఇద్దరూ సెలబ్రెటీలే కదా మరి ఇంత సాదా సీదాగా పెళ్లి కావడం ఏమిటా అని అనుకుంటున్నారా..? అవునండీ వీరి ఇద్దిరికీ పెళ్లి అయ్యింది..వీరిద్దిరికీ కపిల్ శర్మ మదర్ కూడా ఆశీర్వదించారు. ఇద్దరూ అక్కడిక్కడే దండలు మార్చేసుకున్నారు.

పెద్దల దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ ఫోటోలను కపిల్‌ ట్విట్టర్‌లో పెట్టాడు. ‘నన్ను ఆనందంగా ఉంచుతానని, షాపింగ్‌లకు, సినిమాలకు తీసుకెళ్తానని జాక్వెలిన్‌ మాటిచ్చింద’టూ కామెంట్‌ కూడా పెట్టాడు.   పెళ్లి మాత్రం అంతా ఉత్తుత్తిదే..కేవలం ‘ది ఫ్లయింగ్‌ జాట్‌’ సినిమా  పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. అయితే ఇది కాస్త వైరల్ గా వ్యాపించింది.  ఈ పబ్లిసిటీ స్టంట్‌ చూసి చాలామంది సినీ జనాలే ఆశ్చర్యపోయారు.

కపిల్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: