జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా అతృతతో ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ టాకీ పార్టు మొత్తం పూర్తయ్యింది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ ఏడెకరాల స్థలంలో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. అర్ట్ డైరెక్టర్ ప్రకాష్ రూపొందించిన సెట్ చూసిన వారిని అబ్బుర పరస్తుంది. ‘వెల్ కమ్.. వెల్ కమ్.. నా పేరు కనకమ్...’ అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ను ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో జూనియర్ ఎన్టీఆర్, డాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న బాద్ షా సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నెల మొదట్లో ‘బాద్ షా’ ఆడియోను, ఏప్రిల్ మొదటిలో చిత్రాన్ని విడుదల చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: