హీరోయిన్స్ గా వెండితెర మీద వెలుగులు చిందిస్తున్న భామల వెనుక ఏన్నో తెలియని విషాదం అలముకున్న విషయాలుంటాయి. ఇవేవి పట్టించుకోకుండా తమకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ వెళ్తున్న వారు కొందరైతే అవకాశాల కోసం అడిగిందల్లా చేస్తూ కొందరిని సాటిస్ఫై చేయడం అలవాటు అయ్యింది. అయితే బయట పడేవి ఎన్నని చెప్పలేం కాని పరిశ్రమలో నడుస్తున్న ఈ బూతు బాగోతం అందరికి తెలిసిందే.


అయితే ఈ విషయం పట్ల ఎవరు నోరు విప్పరు.. అది కామన్ అనేసుకుంటారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ టిస్కా చోప్రా కూడా తనను ఓ బాలీవుడ్ స్టార్ హీరో తనతో గదిలో గడిపితేనే సినిమా అవకాశం ఇస్తా అన్నాడని సంచలన కామెంట్ చేసింది. మూడు నెలలు అతనితో గడిపితే ఆఫర్ ఇస్తాడన్నాడని అంది. ఇక అతనే కాదు ఓ దర్శకుడు కూడా తనను అలానే అడిగాడని అంది.


మరి ఉన్నట్టుండి అమ్మడికి ఈ వ్యవహారం ఎందుకు గుర్తుకు వచ్చిందో ఏమో కాని టిస్కా చోప్రా చెప్పిన ఆ స్టార్ హీరో, దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత జరిగినా తన టాలెంట్ తో అవకాశాలు చేజిక్కించుకున్నా తప్ప తప్పుదారి పట్టలేదు అన్నది టిస్కా. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే సినిమాల్లో సెటిల్ అవ్వాలంటే అలాంటివి తప్పక చేయాల్సిందే అన్నట్టు మాట్లాడింది. 


మరి తాను చేయలేదు కాని చేసి తీరాల్సిందే అని బలంగా చెబుతున్న టిస్కా చోప్రా మాటలు అందరిని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. అప్పట్లో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఇలాంటి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సర్ధుమనిగింది కదా అనుకుంటున్న టైంలో టిస్కా తన మనోగతం పంచుకుంది. 


ఏది ఏమైనా తెర మీద అందంగా కనిపించే ముద్దుగుమ్మల మనసులో చాలా విశాద కరమైన విషయాలు ఉంటాయని ముందు మనం చెప్పుకున్నట్టే.. పరిశ్రమలో స్టార్ సూపర్ స్టార్ గా వెలుగు వెలగాలంటే ఇలాంటి ఎందరికో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటిని నిలదీసి అడిగే వారు ఉండరనే వారి నమ్మకం. ఊరికే అన్నారా మరి సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం అని.  



మరింత సమాచారం తెలుసుకోండి: