టాలీవుడ్లో సూపర్ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అవ్వలేని కృతి తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ ను అన్ని విధాలుగా వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకే ఇమ్రాన్ హష్మితో చేస్తున్న రాజ్ రిబూట్ సినిమాతో కృతి రాబోతుంది. ఇక రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం ఆమె మీదే నడుస్తున్నట్టు ఉంది. హర్రర్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో కృతి ఓ పక్క అభినయంతో ఆకట్టుకుంటూనే మరో పక్క ఇమ్రాన్ తో ముద్దుల వర్షం కురిపించింది.


హిట్ ఒక్కటే పడలేదు కాని కృతి కర్బందాకు మంచి ఫాలోయింగే ఉంది. ఓ హీరోయిన్స్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్ గా ఉన్నా ఎందుకో అమ్మడు క్రేజ్ సంపాదించలేదు. తెలుగులో బోణి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించింది. ఆ సినిమాతో సూపర్ హీరోయిన్ అవుతుందని ఆశించినా అది జరుగలేదు.


ఇక కృతి కర్బందా ఉన్న సినిమా ఫ్లాపే అన్న టాక్ కూడా వచ్చింది. అయితే తెలుగులో అన్ లక్కీ అయిన ఈ అమ్మడు కన్నడ, తమిళ భాషల్లో పర్వాలేదనిపించుకుంది. ఇక బాలీవుడ్లో మొదటి ప్రయత్నం చేస్తున్న కృతి అందరి లానే బోల్డ్ గా నటించడానికి సై అన్నది. ఇప్పటికే ట్రైలర్ లో ముద్దుసీన్స్ లో రెచ్చిపోయిన కృతిని చూస్తుంటే బీ టౌన్ కల్చర్ బాగా అలవరించుకుందని చెప్పొచ్చు.


సౌత్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ బాలీవుడ్లో ఒక్క సినిమాతో సంపాదించుకునే ఉద్దేశంతో కృతి అన్నిటికి తెగించేసింది. ఇక సీనియర్ కిస్సర్ ఇమ్రాన్ తో లిప్ లాక్ చేస్తే ఆ హీరోయిన్ దశ తిరిగినట్టే. మరి చూస్తుంటే అన్ని పరిణామాలు కృతికి ఈసారి కలిసి వచ్చేలానే ఉన్నాయి. కృతి లాంటి బ్యూటీకి బాలీవుడ్లో సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదు. 


విక్రం భట్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మహేష్ భట్, ముఖేష్ భట్, భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హస్మి, కృతి కర్బంధాతో పాటుగా గౌరవ్ అరోరా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. మరి సినిమా ఎలా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: