సినిమా ఇండస్ట్రీలో అంటేనే ఓ రంగుల ప్రపంచం..ఇక్కడ ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్లూ ఉన్నారు..అన్నీ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. తెరపై కనిపించిన వీరు తెర వెనుక ఎలా ఉంటారు అనేది మిస్టరీ..ఎందుకంటే మనం కూడా వాళ్లను తెరపై ఎలా ఉన్నారో అలాగే తెర వెనుక కూడా అలాగే ఉన్నారనుకొని భ్రమ పడుతుంటాం. ఒకప్పుడు మళియాళీ ఇండస్ట్రీలో షకీలా అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు షకీలా సినిమాలు విడుదల అవుతున్నాయంటే పెద్ద హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసేవారని సమాచారం. అలాంటి షకీలా గత పది సంవత్సరాల నుంచి తెరపై అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అది కూడా చిన్న పాత్రల్లో మాత్రమే..మరి దానికి కారణం ఏమిటి..? తన అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిని సెక్సీ భామ పరిస్థితి ఏమిటని అడిగితే తన ఆవేదన వ్యక్తం చేసింది.

            షకీలా చెప్పిన షాకింగ్ న్యూస్..!!
ఆమె జీవితానికి సంబందించిన కొన్ని నమ్మలేని నిజాలను ఈరోజు షకీలా ఒక ప్రముఖ పత్రికతో షేర్ చేసుకుంది.స్టార్ హీరోల సినిమాల్లో కూడా గ్లామర్ పాళ్ళు ఉన్నప్పటికీ, తన సినిమాలను అశ్లీల సినిమాలుగా చూపించారని అంటుంది షకీలా. ప్రధానంగా కేరళ పరిశ్రమలో స్త్రీలకు సరైన గౌరవం లేకపోవడం, మెల్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో ఇలా జరిగిందని అంటున్నది.ఇప్పటికీ ఆ ఇండస్ట్రీలో పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పింది. ఈ తరం హీరోయిన్లు తెలివిగా వ్యహరిస్తున్నారని చెప్పుకొచ్చింది.

మంచి ఫామ్ లో ఉన్నపుడు తాను తన వాళ్లను నమ్మానని అయినవారే తనను దారుణంగా మోసం చేశారని అన్నారు. ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టు లు ఇండస్ట్రీలో కొనసాగకపోయినా ఉన్నంతలో మంచి ఫెమ్ తో పాటు డబ్బు సంపాదించుకొని తర్వాత ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని అంటున్నది. వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో ఎంతో నష్టపోయానని, తన మేనేజర్‌ తో పాటు సొంతవారు కూడా తన డబ్బు తీసుకొని మోసం చేశారని షకీలా కన్నీటి పర్యంతం అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: