ఒక సినిమా హీరో అతను ఏం చెయ్యగలడు? యాక్షన్ అంటే కెమెరా ముందరకి వచ్చి కట్ అంటే తెర వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ? కానీ కొందరు ఉంటారు విభిన్నంగా .. యాక్షన్ అంటే ఒచ్చి కట్ అంటే వెళ్ళిపోయే నటులు కాదు వాళ్ళు. వాళ్ళ స్థాయి , స్థానం వేరు అని నిరూపించుకుంటూ ముందుకి కదులుతూ ఉంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమని ఎంతమంది తప్పుగా అర్ధం చేసుకున్నా కూడా తాము అనుకున్న మంచిని చేసి గానీ వదలని మొండి ఘటాలు. సినిమా అంటేనే రంగుల లోకం అందులో హ్యాపీగా బతుకుతూ , మందు కొడుతూ , ఆడవారితో గడుపుతూ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చెయ్యడంని మించింది ఏముంటుంది చెప్పండి ? కానీ ఆమిర్ ఖాన్ అలా కాదు.



మొదటి నుంచీ కూడా అతని ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజా సేవ చెయ్యడం మీద ఆమిర్ కి ఎప్పుడూ ఆరాటమే. ఎవరో ఒస్తారు ఎదో చేస్తారు అని కూర్చునే రకం కాదు అతను. తానే స్వయంగా ముందు అడుగు వెయ్యడం లో ఎప్పుడూ సాహసం చేస్తాడు. ఒక లగాన్ దగ్గర నుంచి , తారే జమీన్ పర్ వరకూ అందరికీ నచ్చే సినిమాలు తీయాలి అన్నా సత్య మేవ జయతే నుంచి ఇవాల్టి తన సొంత ఫౌండేషన్ వరకూ ఆఫ్ స్క్రీన్ లో కూడా తాను హీరో అని నిరూపించుకోవాలి అన్నా అది ఆమిర్ ఖాన్ కి మాత్రమే సాధ్య పడింది. కానీ దురదృష్టం అతను చేసిన మంచి కన్నా అతను చేసిన వ్యాఖ్యలకే దేశ వ్యాప్తంగా ఇబ్బంది ఏర్పడింది.  అప్పట్లో ''అసహనం'' కామెంట్లతో అందరి చేతిలో తిట్లు తిన్నా కూడా.. తను చేసే పనులతో గాట్టి జవాబే చెబుతున్నాడు. వాటిని పబ్లిసైజ్ చేసుకోవట్లేదు ఆమిర్.




మహారాష్ట్ర లో దేశం లో ఎక్కడా లేనంత నీళ్ళ కొరత ఉంది. కరువు అక్కడ విలయ తాండవం చేస్తోంది. పంట భూముల సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు ఎండాకాలం ఒస్తే. ఆమిర్ ఖాన్ తన సొంత ఫౌండేషన్ ద్వారా ఇక్కడ పరిస్థితి మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి మంచి చేస్తున్నప్పుడు అక్కడి ప్రభుత్వం కూడా వారికి సహకారం ఇచ్చి తీరాల్సిందే కదా! అందుకే  దేవేంద్ర ఫద్నీస్ సర్కార్ కూడా అమీర్ కు సపోర్టు చేస్తోంది. ఆమిర్ ఇప్పుడు తన ఫౌండేషన్ ద్వారా కొత్త పోటీ మొదలు పెట్టాడు.



వాన నీటిని కాకుండా రోజూ వాడే నీటిని మళ్ళీ ఉపయోగపడే విధంగా కొన్ని పద్దతులని నేర్పించే పోటీ ఇది. ప్రతీ గ్రామం నుంచీ ఐదుగురికి నీళ్ళని ఎలా స్టోర్ చెయ్యాలి అనేది ఆమిర్ ఫౌండేషన్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు.వీళ్ళలో ఏ గ్రామం వారు ఆ పద్దతులు అన్నీ ఫాలో అయ్యి ఎక్కువ నీరు స్టోర్ చేసుకుంటారో వారికి 50 లక్షల బహుమతి ప్రకటించాడు. ఈ యాభై లక్షల కోసం ప్రతీ గ్రామం పోటీ పడి మరీ నీళ్ళని నిల్వచేస్తాయి. ఈ దెబ్బతో వచ్చే ఐదేళ్ళ లో కరువు లేని ప్రాంతంగా మహారాష్ట్ర మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ ఫౌండేషన్ కోసం స్వయంగా తన సొమ్ముతో ఏకంగా 100 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని మరీ గట్టిగా నిర్వహిస్తున్నాడు అంటే అతని డెడికేషన్ ని మెచ్చుకుని తీరాల్సిందే.




ఎంతటి ధృడ సంకల్పంతో పనిచేస్తున్నాడో. ఇంత గొప్ప పనిచేస్తున్న అమీర్ ను అనవసరంగా తిట్టిపారేశాం అనే ఫీలింగ్ ఇప్పుడు చాలామందికి కలుగుతోంది అంటే అతిశయోక్తి కానే కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమిర్ ఖాన్ తలచుకుంటే ఎప్పుడో రాజకీయాలవైపు అడుగు వెయ్యగలడు . అతను అడుగు పెడతా అంటే బీజేపీ కళ్ళకి అద్దుకుని మరీ తీసుకుంటుంది. కానీ ఆమిర్ అలాంటి పని చెయ్యలేదు, కారణం సేవ చెయ్యడానికి రాజకీయాలు అవసరం లేదు అని - అవి అతని సంకల్పాన్ని మట్టికరిపిస్తాయి అని అమీర్ ఫీలింగ్.




జనాలకి సేవ చేసే విషయం లో పవన్ కళ్యాణ్  కీ ఆమిర్ ఖాన్ కీ దగ్గర పోలికలు కనిపిస్తాయి. కష్టం తో ఒచ్చిన వారు ఎవ్వరికైనా లేదు అనకుండా ఇచ్చేసే మనస్తత్వం ఇద్దరిదీ , పైగా పబ్లిసిటీ కి కూడా దూరంగా ఉంటారు. అలాంటిది ఇద్దరూ ఎంచుకున్న బాటలు చూస్తేనే మింగుడు పడని పరిస్థితి. కుళ్ళిపోయిన రాజకీయాలలో దిగే బదులు పవన్ కళ్యాణ్ కూడా ఆమిర్ లాగా ఎదో ఒక జిల్లా మీద దృష్టి పెట్టి అభివృద్ధి పథం లోకి తీసుకుని ఒస్తే ఎంత బాగుంటుంది. ఓట్ల గోల, జంపింగ్ ఎమ్మెల్యేలు , డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఈ దరిద్రపు రాజకీయాలలో పవన్ లాంటి వారు ఉండగలగడం కల్లో విషయం. కాస్త అర్ధం చేసుకుని ఆమిర్ ని చూసైనా పవన్ కళ్యాణ్ తన ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: