బెంచ్ మార్క్ - అంటే ఈ రేంజ్ ని అందుకోవడం గొప్ప లక్ష్యం గా ఇంతకు మించి ఏదీ లేదు అన్నట్టుగా కొంత కాలానికి అంటే పీరియడ్ లో ఒక స్థాయిని క్రియేట్ చేసేదాన్ని బెంచ్ మార్క్ గా గుర్తిస్తారు. భారతీయ సినిమాకి మొన్న మొన్నటివరకూ వరకూ అలాంటి బెంచ్ మార్క్ లేదనే చెప్పాలి. ఎన్నో సినిమాలు ఒచ్చాయి షోలే నుంచి మొన్నటి 3 ఇడియట్స్ వరకూ వందల సినిమాలు అత్యధికంగా ప్రభావితం చేసాయి కానీ బెంచ్ మార్క్ సృష్టించిన సినిమాలు ఒక్కటీ లేవు. తెలుగు నాట నుంచి రాజమౌళి తీసిన ఖాళాఖండం ' బాహుబలి ' ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ గా మారింది. ఎవ్వరు భారీగా సినిమా తీయాలి అన్నా కూడా ఇప్పుడు బాహుబలి ని బెంచ్ మార్క్ గా అనుకుంటున్నారు. ఒక పెద్ద బడ్జెట్ సినిమాని తీయడానికి డైరెక్టర్ కథ చెబితే " బాహుబలి రేంజ్ లో ఉంటుందా ? " అంటూ నిర్మాత అడగడం సర్వసాధారణం అయిపొయింది.


బాలీవుడ్ హీరోలకి సైతం బాహుబలి ని బీట్ చెయ్యడం అనేది ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. అందరూ బాహుబలి జపం చేస్తున్నారు. బాహుబలి విడుదల అయిన కొన్ని నెలలకి వచ్చిన రుద్రమదేవి తో ఈ పోలికలు మొదలు అయ్యాయి. కాస్త హిస్టారికల్ గా ఏ సినిమా వచ్చినా కూడా దాన్ని బాహుబలి తో పోల్చడం మొదలు పెట్టింది అప్పుడే. గుణశేఖర్ తీసిన ఆ సినిమాలో అతి పేలవమైన గ్రాఫిక్స్, మంచి కథ, అనుష్క - అల్లూ అర్జున్ ల నటన ఆకట్టుకోవడం తో ఆ సినిమా పెద్ద హిట్టే అయ్యింది. కొన్నాళ్ళ తరవాత తమిళ హీరో విజయ్ ఒక భారీ పౌరాణిక చిత్రం తీస్తున్నాడు అని తెలిసాక దానికి ఇంకా టైటిల్ కూడా పెట్టకుండానే ' బాహుబలి ని కొట్టే చిత్రం మా తమిళం లో ఒస్తోంది ' అంటూ నానా హడావిడీ చేసారు తమిళ జనాలు.



విజయ్ ఫాన్స్ గోల అయితే ఇక చెప్పన్నక్కరలేదు. ' పులి ' అనే టైటిల్ తో వచ్చి బాహుబలి పేరు చెప్పి ఆ సినిమా కంటే బాగుంటుంది అని ఎక్కువకి అమ్మేసుకుని సేఫ్ అయిపోయాడు నిర్మాత. అదొక హిస్టారికల్ సినిమాగా కాక కామెడీ సినిమాగా తమిళ చరిత్ర లో మిగిలిపోయింది. అతి వరస్ట్ గ్రాఫిక్స్ , అంతకంటే దరిద్రమైన కథ - కథాంశం తో మొదటి రోజు థియేటర్ లలోంచి విజయ్ డై హార్డ్ ఫాన్స్ సైతం బయటకి పరుగులు పెట్టేంత గొప్ప సినిమా అది. దాన్ని బాహుబలి తో పోల్చిన వాళ్ళు వెధవలు అయ్యారు కూడా. ఇలా అనేక సందర్భాల్లో బాహుబలి తో పోల్చుకోవడం వాతలు పెట్టుకోవడం ఒక్కొక్క నిర్మాత , హీరో , హీరో అభిమానులు, డైరెక్టర్ లకి మామూలు అయిపోయిందని.




బాహుబలి లాంటి గొప్ప చిత్రం నుంచి స్ఫూర్తి పొంది అలాంటి సినిమా ఒకటి మేమూ ట్రై చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్పే కాదు. ఎందుకంటే అందరి సినిమాలూ ఎదగాలు, భారతీయ పరిశ్రమ నుంచి మంచి క్వాలిటీ చిత్రాలు ఒచ్చి తీరాలి కానీ బాహుబలి ని కొట్టేస్తున్నాం అంటూ కామెడీ గా మాట్లాడితే నవ్వొస్తుంది. అప్పట్లో ఇదే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి తీసిన మగధీర తరవాత పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు బద్రీ నాథ్ , శక్తి లాంటి సినిమాలు ఒచ్చి జనాలని థియేటర్ లలోంచి పరుగులు పెట్టించాయి. కానీ మగధీర దేశ వ్యాప్తంగా బెంచ్ మార్క్ ని మాత్రం క్రియేట్ అయితే చెయ్యలేదు. బాహుబలి 2 రావడానికి సిద్దం అవుతూ ఉన్నా బాహుబలి మొదటి భాగం మేనియా ఇంకా పూర్తి అవ్వలేదు.



శేఖర్ కపూర్ లాంటి డైరెక్టర్ లు సైతం రాజమౌళి ని చూసి నేర్చుకోమంతున్న వేళ ఇంకా చాలా సినిమాలు బాహుబలి ముందు తొడ గొడుతున్నాయి, తొడ గొట్టి కింద పడిపోతున్నాయి. నిన్నటికి నిన్న మొహంజదారో సినిమా సంగతి ఏమైందో చూసాం. ఈ సినిమా కి పెద్ద హీరో హ్రితిక్ రోషన్ , నమ్మకం ఉన్న డైరెక్టర్ అసుతోష్ ఉన్నారు అయినా కూడా బాహుబలి తో పోల్చడం వల్లనే నీరుగారిపోయింది అనేది విశ్లేషకుల వాదన . ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమాలు ఒస్తున్నాయి. తమిళ దర్శకుడు సుందర్ బాహుబలి ని చూసి స్ఫూర్తి పొంది ఒక పిరియాడికల్ డ్రామా ని తెరకి ఎక్కిస్తున్నారు. కార్తి కాష్మోరా లుక్ చూసి అందరూ బాహుబలి కి పోటీ అంటూ తమిళనాట మళ్ళీ హడావిడి మొదలెట్టేసారు. ఇవి  కాకుండా కన్నడం లో బాహుబలి లాంటి భారీ సినిమా వైపు అడుగులు పడుతున్నాయి.  దీనికి ఈగ ఫేం సుదీప్ హీరోగా చెయ్యడం విశేషం.


దర్సకుడుగా కూడా సుదీప్ ఈ సినిమాని హ్యాండిల్ చెయ్యడం గమనార్హం.తెలుగు.. తమిళం.. కన్నడ భాషల్లో భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా తీయబోతున్నట్లు సుదీప్ చెప్పాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందట. 'ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘బాహుబలి’లాంటి సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను.'  అని డైరెక్ట్ గా చెప్పేసి పోలిక తానే మొదలు పెట్టేసాడు సుదీప్ దాంతో అతనికే ఎసరు తప్పదు. రాజమౌళి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే, అతని బడ్జెట్ లో ఆ రేంజ్ లో సినిమా తీయడం అంత క్వాలిటీ తో జరిగే పని కాదు. బాహుబలి తో పోల్చుకుంటే వాతలు పెట్టుకున్నట్టే అని సినిమా మేకర్ లు ఎప్పటికి అర్ధం చేసుకుంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: