భారత దేశానికి తన పతకం ద్వారా వన్నె తెచ్చిన సింధూ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఎక్కడ చూసినా అభిమాన వెల్లువ , నజరనాలూ ఇవన్నీ మామూలే .. ఆమెతో పాటు ఆమె కోచ్ గోపీ చంద్ మీద కూడా ప్రసంసల వెల్లువ కురుస్తోంది. పుల్లెల గోపీచంద్ గా ఎప్పటి నుంచో భారత దేశ క్రీడాభిమానులకి సుపరిచితం అయిన గోపి దేశ పతాకాన్ని 2016 లో ఒక కోచ్ గా రెపరెప లాడిస్తాడు అని ఎవ్వరూ బహుశా ఊహించి ఉండరు.



గోపీ చంద్ బాడ్మింటన్ అకాడమీ పెట్టి అందులో తానే సొంతగా ట్రైనింగ్ ఇస్తూ సింధూ లాంటి వాళ్ళని తయారు చెయ్యడం మొదలు పెట్టాడు ఆయన. చివరకి ఎన్నో సంవత్సరాల కృషి ఈ రోజు ప్రపంచం మొత్తం అతని పేరు, అతని శిష్యురాలి పేరు మారు మ్రోగే విధంగా చేసింది. ఇప్పుడు సింధూ - గోపీ చంద్ ల మీద ఎంతమంది బయో పిక్ లు తీస్తారు అనేది ఆశ్చర్యకర విషయం. భలే మంచి రోజు విడుదల అయిన తరవాత తెలుగు హీరో సుదీర్ బాబు ఇప్పటి వరకూ తన తరవాతి ప్రాజెక్ట్ ని మొదలు కూడా పెట్టలేదు. పుల్లెల గోపీ చంద్ జీవిత విశేషం ఆధారంగా ఆయన జీవిత గాథ ని తెరకి ఎక్కించే సినిమాకి ఎప్పుడో సంతకం పెట్టిన సుధీర్ ఇప్పటి వరకూ షూటింగ్ మొదలు పెట్టలేదు.




ఈ సినిమాని హిందీ లో తీయడానికి ఫిక్స్ అయిన సుధీర్ అక్కడ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉండడం తో తాను గ్యాప్ తీసుకుంటున్నాడు. మొన్న మొన్నటి వరకూ ఈ సినిమా ఎప్పుడు షురూ అవుతుందో ఎవ్వరికీ తెలీదు కానీ ఇప్పుడు ఒలంపిక్స్ లో సింధూ మెడల్ గెలవడం , వెనకాల గోపీ చంద్ ప్రోద్బలం వల్లనే అంతా జరిగింది అని మీడియా కోడై కూస్తూ ఉండడం తో ఈ సినిమా రైటర్ లకి ఫుల్ బూస్ట్ ఒచ్చేసింది. క్లిమక్స్ కి , ప్రీ క్లిమాక్స్ కీ  కావాల్సినంత స్టోరీ వారికిప్ప్పుడు దొరికేసింది. గోపీ కథ లో మొదటి నుంచీ చాలా స్ట్రగుల్ అయిన అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కలిపి కథ ఒండుతున్న కథకులకి ఇప్పుడు అమేజింగ్ లైన్ దొరికింది . తన స్టూడెంట్ కోసం జీవితాన్ని మొత్తం కష్ట పడిన గురువు గా కథ లో మార్పులు చేస్తూ సింధూ మెడల్ అచ్చీవ్మేంట్ ని క్లిమాక్స్ గా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.




భారత క్రీడా చరిత్ర లో అత్యంత ప్రభావిత కోచ్ ల జాబితా లో నిలిచిన గోపీ చంద్ మీద సినిమా అంటే అదిప్పుడు ఖచ్చితంగా హాట్ టాపిక్కే. దేశం అంతా అతని సూపర్ కృషి ని పొగుడుతూ ఉన్న వేళ గోపీ మీద సినిమా ప్రకటిస్తే చాలు డిస్ట్రిబ్యూటర్ లు వాలిపోతారు. మొన్నటి వరకూ ఒక లెక్కా ఇప్పుడు ఒక లెక్కా అన్నట్టు ఉంది ఈ మేకర్ ల పరిస్థితి. తాజాగా జరిగిన పరిణామాలు గోపీ చంద్ బయో పిక్ రచయితలకి బోలెడంత గొప్ప ఇంగ్రీడియంట్ లని తెచ్చి పెట్టాయి. సుధీర్ బాబు కూడా ఒకప్పుడు బాడ్మింటన్ క్రీడాకారుడు కావడం తో సుదీర్ కి ఈ స్టోరీ మీద ఇంకా గ్రిప్ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇప్పుడు గోపీ చాలా పెద్ద ఫేమస్ ఫిగర్ అయిపోయాడు. ఇండియా రావడం ఆలస్యం వారిని ప్రశ్నలతో ముంచెత్తేవారు బోలెడు మంది ఉంటారు. మీడియా హడావిడి మామూలుగా ఉండదు.




ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టడం ఆలస్యం ఘన స్వాగతం కోసం అంతా సిద్దం చేసాం అని ప్రకటించింది తెలంగాణా ప్రభుత్వం. ఇంతగా ఫేమస్ అయిన గోపీ మీద సినిమా అంటే సుదీర్ బాబు లాంటి అనామక ఫేస్ తో బాలీవుడ్ మేకర్ లు రిస్క్ తీసుకుంటారా అనేది ప్రశ్నార్ధకం. సడన్ గా సుదీర్ కి ఇది సూపర్ ప్రాజెక్ట్ అనిపించి ఇప్పటికే మేకర్ లని మొదలెడదాం అని కంగారు పెడుతున్న తరుణం లో అతన్ని పీకేసి మరొక బాలీవుడ్ లో తెలిసిన మొఖాన్ని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒకే ఒక్క సినిమాలో అదీ విలన్ గా మాత్రమే సుధీర్ అందరికీ తెలుసు సో ఈ స్టోరీ కి కొత్త వ్యక్తి తో ఓకే చెప్తారా లేదా చూడాలి. ఎందుకంటే గోపీ చంద్ బయో పిక్ అంటే మొన్నటి వరకూ ఒక లెక్కా నిన్నటి నుంచీ మరొక లెక్క. 


మరింత సమాచారం తెలుసుకోండి: