గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చర్చించుకునే టాపిక్ ఏదైనా ఉందంటే అది కచ్ఛితంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీనే. ఎందుకంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన తెలుగు ఫిల్మ్ ఏకంగా600 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయటం...అంతకు మించి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గట్టి స్ట్రోక్ ఇవ్వటం వంటివి బాహుబలితోనే సాధ్యం అయింది.


కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఒక స్టెప్ వెనక ఉంటుంది. కానీ బాహుబలితో కోలీవుడ్ కంటే టాప్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని నిరూపితమైంది. ఇక తాజాగా వచ్చిన 'కబాలి' సినిమా సంచలనం క్రియేట్ చేయటంతో బాహుబలి రికార్డ్ ని ఇది తుడిచిపెట్టింది. తొలిరోజున ఓపెనింగ్స్ నుండి ఇప్పటి వరకూ ఈ మూవీ 650 కోట్ల రూపాయలను దాటి 700 కోట్ల రూపాయలకి చేరువలో ఉంది.


యుఎస్ ఏ లో చాలా వేగంగా 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా ఘనతను సొంతం చేసుకుంది. దీంతో బాహుబలి రికార్డ్ బద్దలు అయిందనే చెప్పాలి. రాజమౌళికి ఎప్పుడు నెంబర్ వన్ లోనే ఉండటం ఇష్టం. తన మూవీ రికార్డ్ పోవటంతో...వెంటనే బాహుబలి పార్ట్2 బిజినెస్ ని ఏవిధంగా పెంచుకోవాలి అనే విషయంపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ తో దాదాపు 30నిముషాలు చర్ఛించారంట.


ఎందుకంటే బాహుబలికి ఇంటర్నేషనల్ గుర్తింపు రావటానికి కరణ్ జోహార్ ది కీలకపాత్ర. అందుకే బాహుబలి2 కి సైతం కరణ్ జోహార్ కీలకంగా మారాడు. బాహుబలి2ని దాదాపు 6000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనేది బాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి సైతం ఈ మూవీని 1000 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ గా మార్కెట్ చేసుకోవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: