నారారోహిత్ హీరోగా నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ‘జ్యో అచ్యుతానంద’. ఈ మూవీపై ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా చర్ఛలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో డైరెక్టర్ గా మారిన యాక్టర్ అవసరాల శ్రీనివాస్, ఆ మూవీతోనే మంచి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా అవసరాల శ్రీనివాస్ పై ముద్రపడటంతో…వెంటనే మరో సరికొత్త కథాంశాన్ని రెడీ చేసుకొని, నారారోహిత్ తో మూవీని మొదలుపెట్టాడు. ఆ విధంగా వచ్చిన మూవీనే ‘జ్యో అచ్యుతానంద’. ‘జ్యో అచ్యుతానంద’ మూవీకి సంబంధించిన అవుట్ పుట్ బాగా వస్తుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ వేడుకని జరుపుకుంది.


ఇందులో నారారోహిత్ తో పాటు నాగశౌర్య సైతం నటించటం విశేషం. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ చాలా స్లోగా ఉందనేది మార్కెట్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్స్. ఎందుకంటే డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే మూవీ మంచి హిట్ అయినప్పటికీ…తన రెండో మూవీ అవుట్ పుట్ ని చూసిన తరువాతే మూవీని కొంటామని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతని డిమాండ్ చేస్తున్నారంట.


ఇక తాజాగా విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ బాగున్నప్పటికీ…డిస్ట్రిబ్యూటర్స్ నుండి వచ్చే ప్రశ్న మాత్రం మారటం లేదు. కచ్ఛితంగా ‘జ్యో అచ్యుతానంద’ ప్రివ్యూని చూడాల్సిందేనని పలువురు డిస్ట్రిబ్యూటర్స్ కోరటంతో…మూవీకి సంబంధించిన బిజినెస్ స్లోగా జరుగుతుందని అంటున్నారు. అయితే డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్నోడు కావటంతో…తనని నమ్మొచ్చు అని హీరోగారు డిస్ట్రిబ్యూటర్స్ కి హామీ ఇవ్వటంతో ఇప్పుడు వ్యవహారం కొంత సద్దుమణిగిందని అంటున్నారు.


నారారోహిత్ వరుస చిత్రాలు చేస్తున్నారు కాబట్టి…ఈ మూవీ హిట్ అయితే కచ్ఛితంగా తరువాత చిత్రాలకి మార్కెట్ పెరుగుతుంది. అందుకే హీరోగారి మాటలను నమ్మిన కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్…‘జ్యో అచ్యుతానంద’ ప్రివ్యూ తో సంబంధం లేకుండా బజినెస్ ని చేసుకుంటున్నారనే టాక్స్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక రోహిత్, శౌర్య, రెజీనాల మధ్యన వచ్చే సన్నివేశాలు ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్నాయి.


వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాని తెరకెక్కించారు. సెప్టెంబర్ నెలలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కి ఇది రెండో మూవీ కావటంతో…ఈ మూవీ విజయంపై గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: