ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి హీరోల కంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలకి ఉండే ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకం. ఒక హీరోకి సంబంధించిన ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారంటే చాలు…వారికి స్టార్ డం వచ్చేంత వరకూ ఆ ఫ్యాన్స్ అండదండలు కచ్ఛితంగా ఉంటాయి. ఇక హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు అంటే…అభిమానులు చూపించే అవభిమానం అంతా ఇంతా కాదు.


కచ్ఛితంగా ఆ హీరోగారి తనయుడి మూవీ ఎలా ఉన్నప్పటికీ దాన్ని బ్లాక్ బస్టర్ చేయాల్సిందే అని ఫ్యాన్స్ భావిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నటించిన మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంటే…దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కడా కనిపించటం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా సాధారణంగా ఉంటేనే చాలు…అది బ్లాక్ బస్టర్ చేస్తారు ఫ్యాన్స్.


మరి అంతటి బలమైన ఫ్యాన్స్ ని కలిగి ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం…తన తనయుడు అకీరా విషయంలో చాలా కూల్ గా ఉన్నారు. అకీరా ఇప్పటికే రేణూ దేశాయ్ దర్శకత్వంలో 2014లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రంలో ఓ పాత్రని చేశాడు. ప్రస్తుతం ఇది ఇది తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 4న ఓ ఛానల్‌లో ఇది టెలికాస్ట్ అవుతుంది. 2013 నుంచే అకీరా ఓ మూవీలో చిన్న పాత్రని చేస్తున్నాడు అంటూ రేణుదేశాయ్ చెబుతున్నప్పటికీ...పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై ఏ మాత్రం స్పంధించటం లేదు.


అకీరా నటిస్తున్న మూవీపై పవన్ కల్యాణ్ ఏనాడు ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వటం లేదని అంటున్నారు. దీంతో అకీరా గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది కష్టంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అంతా వారి తనయుల అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు సోషియల్ మీడియా ద్వార ఫ్యాన్స్ కి తెలియజేస్తుంటారు. ఇటువంటి వారిలో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు.


ప్రిన్స్ తన తనయుల వివరాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చేరవేస్తుంటారు. దీంతో ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం…తన తనయుడు అకీరా నటించిన మూవీ వివరాలను ప్యాన్స్ కి తెలియపరిస్తే…ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతారనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాటలు. మొత్తంగా రేణూ దేశాయ్ మాత్రం అకీరా కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో వెల్లడిస్తూ వస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: