టాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా క్రేజీ మూవీ తెరకెక్కుతుందంటే చాలు…ఆ మూవీకి సంబందించిన కథ ఏమై ఉంటుంది…? ఆ డైరెక్టర్ సీన్స్ ని ఎలా తెరకెక్కిస్తున్నారు? పోస్ట్ ప్రొడక్షన్ లో అవుట్ పుట్ ఎలా వస్తుంది? అనే విషయాలను ఇండస్ట్రీకి చెందిన టెక్నిషియన్స్ తెలుసుకోవటానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. ఒకవేళ ఇటువంటి ఆసక్తి లేని టెక్నిషియన్స్ కి….ఏదొక సందర్భంలో వాటికి సంబంధించిన న్యూస్ ని కచ్ఛితంగా వింటారు.


ఎందుకంటే ఇండస్ట్రీలోని టెక్నిషియన్స్ అంతా ఒకే గొడుగు కింద పనిచేయాలి. అంటే ఒక మూవీకి పని చేస్తున్న టెక్నిషియన్స్…కచ్ఛితంగా మరో మూవీకి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే సీన్ బాలయ్య నటిస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’,రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి2 మూవీల విషయంలో జరుగుతుంది. కొన్ని విభాగాలకి సంబంధించిన టెక్నిషియన్స్ ఈ రెండు మూవీలకి పనిచేస్తున్నారు.


దీంతో కొద్ది రోజుల క్రితం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని….ఒక టెక్నిషియన్ రాజమౌళికి చెప్పాడంట. తను ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీకి కూడ పని చేస్తుండటంతో తనకి అన్ని విషయాలు తెలియసాయని అంటున్నారు. ఇది ఒక్క ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీ విషయంలోనే కాదు…ఇండస్ట్రీలోని అన్ని మూవీల విషయంలో ఇలాగే జరుగుతుంది.


అయితే ఓ మూవీ రిలీజ్ కంటే ముందుగానే అన్ని విషయాలు తెలుసుకున్న ఇతరులు…ఈ విషయాలను సినిమా ఇండస్ట్రీకి సంబంధంలేని వారి దగ్గర మాత్రం ప్రస్తావించరు. ఇదే ఇండస్ట్రీ రూల్. అయితే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీ సీన్స్ ని తెలుసుకున్న రాజమౌళి…కొన్ని సీన్స్ విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. బాహుబలి కంటే సీన్స్ బాగా వస్తున్నాయోమో…అనే అనుమానం కూడ రాజమౌళిలో ఉందని అంటున్నారు.


అయితే రాజమౌళికి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సీన్స్ తెలిసాయన్న విషయం క్రిష్ కి వెరీ రీసెంట్ గా తెలిసిందట. దీంతో ఇది ఎలా జరిగింది? అన్న కోణంలో క్రిష్ ఈ పనిని మరోకరికి అప్పజెప్పాడని చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకు సంగీతాన్ని ‘కంచె’ మూవీకి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ అందిస్తున్నారు. ప్రస్తుతం చిరంతన్ భట్ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీ ట్యూన్లపై కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా హేమ మాలని, కబీర్ బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: