బాలీవుడ్ లో స్వయం కృషితో పైకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.  ఎలాంటి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన ఫైట్స్ తో అందరి మనసు దోచిన అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కుమార్తె ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి యాక్షన్ తరహా చిత్రాలు చేసే అక్షయ్ తర్వాత రొమాంటిక్, కామెడీ చిత్రాలు తీశారు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా.


కెనడా ప్రవాస భారతీయుడైన అక్షయ్  సెప్టెంబరు 1967, సెప్టెంబర్ 9 న జన్మించారు. రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. 1990ల్లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు. వక్త్ హమారా హై(1993), మోహ్రా(1994), ఎలాన్(1994), సుహాగ్(1994), సపూట్(1996), జాన్వర్(1999) వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు.  


ఫిబ్రవరి 2013న అప్పటివరకు విడుదలైన అక్షయ్ సినిమాల వసూళ్ళు మొత్తం కలిపి 20 బిలియన్ రూపాయలు అయ్యాయని మీడియా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మొదటి బాలీవుడ్ నటుడు ఆయనే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: