చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్భంగా నిన్న సోమవారం సాయంత్రం శిల్పాకళావేదికలో జరిగిన  వేడుకలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన ప్రసంగం చాలా మందిని ఆకర్షించింది.  అశేష మెగాభిమానుల సాక్షిగా వరుణ్ తేజ్  తనను చిరంజీవి నిర్ణయం ఏవిధంగా తనను బాధ పెట్టిందో తెలియ చేయడమే కాకుండా తాను ఒక గదిలో తలుపులు వేసుకుని ఏడ్చే విధంగా చిరంజీవి నిర్ణయం ఎలా ప్రభావితం చేసిందో చాలా  వివరంగా వివరించాడు వరుణ్ తేజ్.

చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు సినిమాలు మానేస్తున్నారు అని  తెలిసి నప్పుడు బాధ తో ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు  వరుణ్ తేజ్. అయితే తరువాత చాలాసార్లు  తన పెదనన్నాను ‘డాడీ సినిమాలు ఎప్పుడు చేస్తారు ? వెయిట్ చేస్తున్నాం చాలామంది అడుగున్నతారు’ అని అడిగినా చిరంజీవి చూద్దాం చేద్దాం అంటూ ఉండటంతో తనకు విపరీతమైన బెంగ పెరిగి పోయిన విషయాన్ని బయట పెట్టాడు.

అయితే 9 సంవత్సరాల తరువాత చిరంజీవి అందరి మాటా విన్నారు అంటూ  ‘బాస్ ఈజ్ బ్యాక్’  అంటూ ఉద్వేగంగా చెప్పగానే అతడి స్పీచ్ తో ఒక్కసారిగా ఆడిటోరియం మార్మోగిపోయింది. ఇదే సందర్భంలో వరుణ్ తేజ్  విమర్శకుల పై మరో చరక అంటించాడు. 

చాలామంది మళ్ళీ చిరంజీవి డ్యాన్సులు అలా చేయగలుగుతారా ఫైట్లు చేస్తారా అని అడుగుతున్నారని వారందరికీ తన  సమాధానం ఒక్కటే అంటూ ‘కాశీకి పోయాడు.. కాషాయం మనిషై పోయాడు అనుకున్నారా?  వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనకున్నారా? అదే రక్తం అదే పౌరుషం’ అంటూ ‘ఇంద్ర’ సినిమాలోని డైలాగు చెప్పగానే మెగా అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోయారు.

మెగా యంగ్ హీరోలు అందరూ చిరంజీవి నామస్మరణ చేస్తూ మెగా అభిమానుల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయడానికి తమ వంతు ప్రయత్నాలు తమ శక్తి మేరకు చేయడం అందరి దృష్టిలోనూ పడింది.  అయితే మెగా అభిమానులు మాత్రం ఈ యంగ్ హీరోలు చేస్తున్న హడవిడిని ఆస్వాదిస్తూ ఉన్నా చిరంజీవి రాని లోటును మాత్రం లోలోపల బాగా బాధ పడినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు రాకపోయినా మెగా అభిమానులు మాత్రం ఈసారి పవన్ నామస్మరణ చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో చేయక పోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  ఎటువంటి వివాదాలు సంచలనాలు లేకుండా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ముగిసి పోవడంతో మెగా కాంపౌండ్ ఊపిరి పీల్చుకుంటున్నట్లు టాక్..
 



మరింత సమాచారం తెలుసుకోండి: